గౌతమ్ మీనన్ సినిమా సాహసం స్వాసగా సాగిపో సినిమాపైచాలా హోప్స్ పెట్టుకొన్నాడు నాగచైతన్య. ఈ సినిమా విడుదల లేట్ అవుతున్నా.. గౌతమ్పై నమ్మకంతో ఉన్నాడు చైతూ. తప్పకుండా ఈ సినిమా తన కెరీర్ని మరోలా సెట్ చేస్తుందంటున్నాడు చైతూ. సాహసం స్వాసగా సాగిపో ఆడియో శుక్రవారం రాత్రి హైదరాబాద్లో విడుదలైంది. ఈ సందర్భంగా చైతూ మాట్లాడుతూ “ఏం మాయ చేశావె సినిమాతో నా కెరీర్ ఓ దారిలో పడింది. లవ్ స్టోరీలు చేయగలనన్న నమ్మకం ఏర్పడింది. ఈ సినిమాతో కొత్త చాప్టర్ మొదలవ్వబోతోంది“ అంటున్నాడు చైతూ.
ఏం మాయ చేశావె సినిమాలో పని చేసేటప్పుడు గౌతమ్ మీనన్ ని చూసి చాలా చాలా నేర్చుకొన్నాడట. తనకు హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ పనిచేయాలని ఉంటుందని, ఆ కలని గౌతమ్ నిజం చేశారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. రెహమాన్ లాంటి స్వరకర్తతో పనిచేసే అవకాశం మళ్లీ గౌతమ్ వల్లే వచ్చిందని సంబరపడుతున్నాడు చైతూ. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా హిట్ అయితే.. నిజంగా చైతూ కలలన్నీ నెరవేరినట్టే.