సాక్ష్యం సినిమా నైజాం హక్కులు ఏడు కోట్లకు అమ్ముడుపోయాయని ఆ మధ్య వార్తలు వచ్చాయి. నలభై కోట్లతో తీసిన సినిమా, ఆ రేంజ్ లో అమ్మకుంటే ఎలా అనుకున్నారంతా. నైజాంలో ఏడు కోట్ల రేంజ్ లో అమ్మితే, ఆంధ్ర ఓ పది కోట్లు, సీడెడ్ ఓ అయిదారు కోట్లు కలిసి టోటల్ గా వరల్డ్ వైడ్ గా థియేటర్ హక్కులు పాతిక నుంచి ముఫై కోట్ల మధ్యలో రావాల్సి వుంటుందని అంచనాలు కట్టారు.
అయితే నైజాం అమ్మేసినట్లు, దిల్ రాజు కొన్నట్లు వార్తలు వచ్చినా, ఇంకా మరే ఏరియా అమ్మకాలు మొదలు కాలేదు. ట్రయిలర్ విడుదల వరకు అందరూ వేచి చూస్తున్నారు. ఇకపై అమ్మకాలు షురూ కావాలి.
అయితే ఇదిలా వుంటే నైజాం అమ్మకం వెనుక మతలబు వేరు అని టాక్ వినిపిస్తోంది. నైజాం హక్కులను ఏడు కోట్లకు వాల్యూ కట్టి, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ నే తీసుకున్నారని తెలుస్తోంది. అలా తీసుకుని, ఆయన దిల్ రాజు దగ్గర డిస్ట్రిబ్యూషన్ కు వుంచారట. ఇలా కట్టిన ఏడు కోట్లలో అయిదు కోట్లు హీరో రెమ్యూనిరేషన్ కింద, మిగిలిన రెండు కోట్లు అదనం అన్నమాట.
అంటే హీరో పారితోషికం లేకుండా సినిమా చేసాను అని అనుకుంటే, నైజాం హక్కులు రెండు కోట్లకు వచ్చినట్లు. ఆపై ఎంత వస్తే, అంతా పారితోషికం అన్నమాట. ఇలా నైజాం ఇంత రేటు పలికింది అన్నది చూపించిన మిగిలిన ఏరియాలు విక్రయించాలన్నది ఆలోచనగా తెలుస్తోంది.
మొత్తం మీద బెల్లంకొండ సురేష్ ఘటికుడే. కొడుకుతో మంచి సినిమాలు ఎలా తీయించాలో, ఎలా మార్కెట్ చేయించాలో బాగా తెలుసు. అందుకే మరో రెండు సినిమాలు అప్పుడే లైన్లో పెట్టాడు, సాక్ష్యం విడుదల కాకుండానే.