బెల్లంకొండ శ్రీనివాస్ ఓ పక్క ‘సీత’ సినిమాని పూర్తి చేశాడు. మరోవైపు ‘రాచ్చసన్’ రీమేక్కీ చక చక పరుగులు పెట్టిస్తున్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘రాచ్చసన్’ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రమేష్ వర్మ దర్శకుడు. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రానికి ‘రాక్షసుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. శనివారం ఉగాది పండగ. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఫస్ట్ లుక్నీ విడుదల చేసే అవకాశం ఉంది. ‘సీత’ ఈనెలలోనే విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. జూన్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత కోనేరు సత్యనారాయణ సన్నాహాలు చేస్తున్నారు.