‘రాక్షసుడు’తో ఊపిరి పీల్చుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ ఊపుని రాబోయే సినిమాల్లోనూ కొనసాగించాలని తపిస్తున్నాడు. అయితే ఈసారి కమర్షియల్ సినిమా చేయాలని ఫిక్సయ్యాడు. గత రెండు మూడు సినిమాల్లో డాన్సులు, పాటలు, ఫైటింగులకు సరిగా ఛాన్సు లేకుండా పోయింది. ఈసారి ఆ లెక్కల్ని కూడా సరి చేయాలనుకుంటున్నాడు. అందులో భాగంగా సంతోష్ శ్రీనివాస్ చెప్పిన స్క్కిప్టు ఓకే చేసినట్టు సమాచారం. ‘హైపర్’ తరవాత మైత్రీ సంస్థతో సినిమా చేయడానికి సంతకాలు చేశాడు సంతోష్ శ్రీనివాస్. పవన్ కల్యాణ్ కోసం ఓ కథ రెడీ చేస్తున్నట్టు కూడా వార్తలొచ్చాయి. అయితే… పవన్ సినిమాలకు ఇంకా సిద్ధం కాకపోవడం, మైత్రీ మూవీస్ మరో హీరోని ఇవ్వకపోవడంతో… సంతోష్ మైత్రీ నుంచి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. `రాక్షసుడు` తరవాత బెల్లంకొండ శ్రీనివాస్ చేయబోయే సినిమా ఇదే కావొచ్చు. దీంతో పాటు రెండు మూడు కథల్ని కూడా రెడీ చేస్తున్నారు. అవి కూడా పక్కా కమర్షియల్ కథలే అని తెలుస్తోంది.