బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లో మర్చిపోలేని సినిమా… ‘రాక్షసుడు’. ఈ సినిమాతో తనకో కొత్త ఇమేజ్ వచ్చింది. రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. తన కెరీర్లోనూ… ఇది గుర్తుండిపోయే సినిమాగా మిగిలిపోయింది. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి ‘రుద్రాక్ష’ అనే టైటిల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. రమేష్ వర్మకి ‘ఆర్’ సెంటిమెంట్ బలంగా ఉంది. ‘రైడ్’, ‘రాక్షసుడు’ రెండూ… ఆర్ అనే అక్షరాలతోనే మొదలయ్యాయి. అందుకే ఈచిత్రానికి ‘రుద్రాక్ష’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు టాక్. ఇది కూడా ఓ న్యూ ఏజ్ థ్రిల్లర్ సినిమా అని తెలుస్తోంది. జ్ఞానవేల్ రాజా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. దాదాపు రూ.65 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని టాక్. బెల్లంకొండ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయినా సరే.. రమేష్ వర్మపై నమ్మకంతో ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆగస్టులో ఈ కాంబోకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలెడతారని టాక్.