నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్, వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శ్రీను అంటూ వచ్చి సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా కుర్రాడు పర్వాలేదనిపించుకున్నాడు. మొదటి సినిమాకే డ్యాన్సులు, ఫైట్లతో అదరగొట్టిన బెల్లంకొండ శ్రీను చేస్తున్న రెండవ సినిమా స్పీడున్నోడు. భీమనేని శ్రీనివాస్ దర్శక నిర్మాతగా చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల చేశారు చిత్ర యూనిట్.
నిన్న బెల్లంకొండ శ్రీను పుట్టినరోజు సందర్భంగా వదిలిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి సినిమాలానే కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా అంతే ఎంటర్టైనర్ ని ప్రేక్షకులకు అందిస్తుంది అనడంలో సందేహం లేదనిపిస్తుంది. స్పీడుమీదున్నాడు అనే టైటిల్ తో వస్తున్న బెల్లంకొండ శ్రీను టీజర్ చూస్తుంటే నిజంగానే స్పీడుమీదున్నాడనిపిస్తుంది.
తమిళ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ స్పీడున్నోడు సినిమా శ్రీనివాస్ కు మొదటి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందని నమ్ముతున్నారు చిత్ర యూనిట్. చిత్రీకరణ కూడా చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను త్వరలో విడుదల డేట్ ని ప్రకటించే అవకాశం ఉంది. ఇక బెల్లంకొండ శ్రీను తన మూడో సినిమాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశాడు.