బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలకు మహారాజ పోషకులు మాస్ ప్రేక్షకులే. కమర్షియల్ కథానాయకుడిగా ఎదగాలనే ప్రయత్నంలో ఫక్తు ఫార్ములా సినిమాలు చేశాడు. ఐదు పాటలు, నాలుగు ఫైట్లు, మూడు రొమాంటిక్ సీన్లు, రెండు ఎమోషనల్ సీన్లు, ఓ ఐటమ్ సాంగ్… అందులో భాగమే. ఈ క్రమంలో విమర్శకుల నుంచి, ఓ వర్గం ప్రేక్షకుల నుంచి అతడి సినిమాలకు ఆశించిన ఆదరణ లభించలేదు. కమర్షియల్ సినిమా అభిమానులను ఆకట్టుకుంటూనే కొత్త తరహా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను ఇష్టపడే వాళ్ల కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన సినిమా ‘సాక్ష్యం’. శనివారం ట్రైలర్ విడుదల చేశారు. మార్క్ కమర్షియల్ ఫైట్లతో పాటు పంచభూతాల కాన్సెప్ట్ తీసుకుని ప్రేక్షకులకు అర్థం కాకుండా ప్రజెంట్ చేస్తూ కొంత క్యూరియాసిటీ కలిగించాడు దర్శకుడు శ్రీవాస్. ఈసారి బెల్లంకొండకు కాన్సెప్ట్ బేస్డ్ కథారూపంలో గట్టి అండ దొరికినట్టే అనుకోవాలి. నిర్మాణంలో అభిషేక్ పిక్చర్స్ కాంప్రమైజ్ కాలేదు. ఈ నెల 20న సినిమా విడుదల కానుంది.