తెలుగులో సూపర్ హిట్టయి.. ప్రభాస్ కి మాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన సినిమా ఛత్రపతి. ఈ సినిమాని ఇంత కాలానికి హిందీలో రీమేక్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మన వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఈనెల 12న విడుదల అవుతోంది. అయితే.. తొలి షో మాత్రం పడిపోయింది. హైదరాబాద్ లో ఈ సినిమాని కొంతమంది సన్నిహితులు, మీడియాలోని ప్రముఖులకూ ఈ సినిమా చూపించారు. వాళ్లందరి నుంచీ.. పాజిటీవ్ ఫీడ్ బ్యాకే వస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు చాలామట్టుకు హిందీలో డబ్ అయ్యాయి. వాటికి విపరీతమైన స్పందన వస్తుంది. పైగా హిందీ డబ్బింగ్ రైట్స్ విషయంలో బెల్లంకొండకు సెపరేట్ మార్కెట్ ఉంది. ఈ సినిమాని కేవలం.. బెల్లంకొండని బాలీవుడ్ లో ప్రమోట్ చేయడానికే తీశారు. ఆ లక్ష్యం ఈ సినిమాతో నెరవేరినట్టే అనిపిస్తోంది. కథాపరంగా కొన్ని మార్పులూ చేర్పులూ చేశారని ముందు నుంచీ టాక్ వినిపించింది. అయితే… ఛత్రపతిని ఉన్నది ఉన్నట్టుగా తర్జుమా చేశాడు వినాయక్. కొత్త మార్పులు చేయలేదు. అందుకే ఈ సినిమాని కేవలం హిందీ బెల్ట్‌కే పరిమితం చేశారు. సౌత్ ఇండియన్ మసాలా మూవీస్‌కి బాలీవుడ్ లో ఇప్పుడు మంచి గిరాకీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. ఛత్రపతి అక్కడి జనాలకు నచ్చ వచ్చు. కాకపోతే.. తెలుగు ఛత్రపతిని హిందీ లో డబ్బింగ్ రూపంలో ఇప్పటికే చాలాసార్లు చూసేశారు. అయినా.. ఈ సినిమా చూడ్డానికి థియేటర్లకు వస్తారా? అనేదే పెద్ద ప్రశ్న. కాకపోతే… నార్త్ లో బెల్లంకొండ గట్టిగా ప్రమోషన్లు చేస్తున్నాడు. తను వెళ్లిన ప్రతీచోటా.. జనాలు బాగా గేదర్ అవుతున్నారు. యూత్ కూడా బెల్లంకొండ వెంట పడుతోంది. తనే వాళ్లని థియేటర్లకు రప్పించాలి.