బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో అడుగుపెట్టాడు. తన సినిమాలు హిందీలో డబ్ అయితే యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ వచ్చేవి. దీంతో అక్కడ మంచి క్రేజ్ వుందని అనుకున్నారేమో కానీ మొత్తానికి రాజమౌళి కల్ట్ క్లాసిక్ ‘ఛత్రపతి’ని అదే పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అల్లుడు శీను తో హీరోగా పరిచయం చేసిన వివి వినాయక్ నే శ్రీనివాస్ తొలి హిందీ సినిమాకి డైరెక్ట్ చేశారు.
అయితే సినిమా రిజల్ట్ మాత్రం డిజాస్టర్. ఎక్కడ ఒక్క షో కూడా ఫుల్ అవ్వలేదు. ఓపెనింగ్స్ నిల్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెంట్ డబ్బులు రాకపోగా తిరిగి కట్టాల్సివస్తుంది. డే వన్ జీరో షేర్ అనే మీమ్స్, ట్రోల్స్ నడుస్తున్నాయి. మొత్తానికి చాలా ఆశలతో అక్కడ అడుగు పెట్టిన శ్రీనివాస్ కి ఛత్రపతి రిజల్ట్ పెద్ద షాక్ ఇచ్చింది.