బెల్లం కొండ శ్రీనివాస్ స్పీడు పెంచాడు. ఓ సినిమా చేస్తూనే మరో సినిమా సెట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ‘సాక్ష్యం’ సినిమా పట్టాలమీద ఉంది. మేలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈలోగా మరో సినిమాకి పచ్చ జెండా ఊపేశాడు. బెల్లంకొండ కథానాయకుడిగా నవీన్ సొంటినేటి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దృశ్యం, గోపాల గోపాల, డిక్టేటర్ లాంటి చిత్రాలకు కో డైరెక్టర్‌గా పనిచేశాడు శ్రీనివాస్. తాను బెల్లం కొండ కోసం ఓ కొత్త తరహా కథ సిద్ధం చేసుకున్నాడు. అది శ్రీనివాస్‌కి బాగా నచ్చింది. దాంతో ఈ సినిమా ఇప్పుడు పట్టాలెక్కబోతోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఛోటా కెనాయుడు కెమెరామెన్‌గా వ్యవహరిస్తారు. గురువారం ఈ చిత్రం ప్రారంభం కానుంది. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ సాగుతోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.