ఈమధ్యే సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలున్నాయి. ఇప్పుడు మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తారు.
అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇదో ప్రేమకథ. షూటింగ్ మొత్తం విదేశాల్లోనే సాగుతుంది. త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తారు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రూపొందిస్తున్న షూటింగ్లో బిజీగా ఉన్నాడు బెల్లంకొండ. ఆ సినిమా పూర్తయ్యాకే.. రమేష్ వర్మ షూటింగ్ మొదలవుతుంది. ఒక ఊరిలో, వీర చిత్రాలకు దర్శకత్వం వహించాడు రమేష్ వర్మ. ఆ రెండూ సరిగా ఆడలేదు. మరి ఈసారి ఏం చేస్తాడో చూడాలి.