సక్సెస్ ఫెయిల్యూర్స్ను పక్కన పెట్టి భారీ బడ్జెట్ సినిమాలు చేయడంలో ముందుంటున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పుడు కాజల్ అగర్వాల్, తేజతో కలిసి `సీత` సినిమా చేస్తున్నాడు. రీసెంట్గా తన తొలి సినిమా `అల్లుడుశీను` హీరోయిన్ సమంతతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కాగా.. ఈ వార్తల్లో నిజం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. `ఆర్.ఎక్స్ 100` వంటి సక్సెస్ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. కాగా..లెటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోలుంటారట. బెల్లంకొండ శ్రీనివాస్ ఒక హీరో అయితే.. మరో హీరో కోసం యూనిట్ అన్వేషిస్తుంది. ఈ రెండో హీరోగా నటించబోయే నటుడు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనపడబోతున్నాడనేది సమాచారం. దీని కోసం దర్శక నిర్మాతలు పలువురు హీరోలను సంప్రదిస్తున్నారట. ఈ లిస్టులో `ఆర్.ఎక్స్ 100` హీరో కార్తికేయ పేరు కూడా ఉంది. మరి బెల్లంకొండ సినిమాలో నటించబోయే నెగటివ్ షేడ్ ఉన్న హీరో ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..