బయోపిక్‌ల పరంపర కొనసాగుతోంది. స్టువర్ట్ పురంలో పేరుగాంచిన దొంగ `టైగర్ నాగేశ్వరరావు` పేరుతో ఓ బయోపిక్ తెరకెక్కబోతోందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. రానా, రవితేజల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. చివరికి ఆ దొంగ పాత్ర.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని వరించింది. ఈ సినిమాలో బెల్లంకొండ ని హీరోగా ఫిక్స్ చేస్తూ… అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాకిని `స్టువర్టుపురం దొంగ` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కె.ఎస్ దర్శకుడు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. మణిశర్మ స్వరాలు అందించబోతున్నారు. ప్రస్తుతం `ఛత్రపతి` హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నాడు బెల్లంకొండ. ఆ సినిమా పూర్తయ్యాక.. `స్టువర్టుపురం దొంగ` సెట్స్‌పైకి వెళ్లనుంది. 1970 నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పట్లో స్టువర్టుపురం అంటే.. దొంగలకు ఫేమస్. ఆ గ్యాంగ్ లో టైగర్ నాగేశ్వరరావు ది పెద్ద పేరు. చెప్పి మరీ దొంగతనాలు చేసే దొంగగా… టైగర్ ప్రసిద్ధి. ఆ కథే ఇప్పుడు వెండి తెరపైకి తీసుకొస్తున్నారు.