బెల్లంకొండ శ్రీనివాస్ దృష్టి… ఇప్పుడు ఓ స్పోర్ట్స్ డ్రామాపై పడింది. ఒలింపిక్స్ నేపథ్యంలో సాగే ఓ సినిమాలో నటించడానికి బెల్లంకొండ శ్రీనివాస్ ఓకే చెప్పాడు. ఈ చిత్రానికి రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తారు. రాకేష్ కి ఇది రెండో సినిమా. బెల్లంకొండ గణేష్ హీరోగా.. రూపొందిన ‘నేను స్టూడెంట్ సార్’ సినిమాతో రాకేష్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈలోగా.. శ్రీనివాస్ తోనూ ఈ సినిమా ఓకే చేయించుకొన్నాడు.
ఇదో ఫిక్షనల్ బయోపిక్. ఒలింపిక్స్ నేపథ్యంలో సాగుతుంది. ఓ ఒలింపిక్స్లో ఓడిపోయి.. మరో ఒలింపిక్స్లో హీరో గెలవడంతో కథ ముగుస్తుంది. పిరియాడిక్ డ్రామా స్టైల్ లో ఈ సినిమాని రూపొందించనున్నారు. ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. ‘నేను స్టూడెంట్ సార్’ చిత్రానికీ ఆయనే నిర్మాత. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడవుతాయి.