బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా `రాక్షసుడు` రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘రాచ్చసన్’ సినిమాకి ఇది రీమేక్. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తికావొచ్చింది. ఈమధ్యే టీజర్ కూడా విడుదల చేశారు. ఇంత త్వరగా ఈ సినిమాని ఎలా ముగించేశారా? అనే డౌటు ఎవరికైనా రావొచ్చు. అసలు మేటరు ఏమిటంటే… ఈ సినిమాలో సగం వరకూ వర్జినల్ సీన్లే వాడుకున్నారట. టీజర్లో కనిపించిన కొన్ని షాట్స్ మాతృక నుంచి తీసుకున్నవే. ‘రాచ్చసన్’లో నటించిన నటీనటులు కొంతమంది ఈ రీమేక్‌లోనూ కనిపిస్తారు. వాళ్లతో చేయాల్సిన సన్నివేశాల్ని మాతృక నుంచి యధావిధిగా తీసుకొచ్చేశారు. బెల్లంకొండ ఉండాల్సిన సీన్లు మాత్రం మళ్లీ కొత్తగా తీశారంతే. సాధారణంగా రీమేక్ సినిమా అనగానే.. ఇలా ఎత్తిపోతల సౌకర్యం ఉంటుంది. కాకపోతే… ‘రాక్షసుడు’లో దాన్ని మరింత ఎక్కువగా వాడేసుకుంటున్నార్ట దర్శకుడు. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. దాంతో పాటు.. ఖర్చూ తగ్గుతుంది. ఐడియా బాగానే ఉంది, కాకపోతే… మరీ తమిళ వాసన కొట్టేస్తుందేమో అనేదే డౌటు. మరి… బెల్లంకొండ ఈసారేం చేస్తాడో చూడాలి.