నా రెండో చిత్రం ‘స్పీడున్నోడు‘ ని హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు – హీరో బెల్లంకొండ శ్రీనివాస్
‘అల్లుడు శ్రీను’తో ప్రేక్షకుల ప్రశంసల్ని పొంది తొలి చిత్రంతోనే సూపర్ డూపర్ హిట్ సాధించి 40 కోట్ల క్లబ్లో చేరిన బెల్లంకొండ శ్రీనివాస్ డాన్స్ల్లోనూ, ఫైట్స్‌లోనూ తనకంటూ సపరేట్ స్టైల్‌ని క్రియేట్ చేసుకున్నారు. పక్కింటి కుర్రాడిలా అనిపించే బెల్లంకొండ శ్రీనివాస్‌ని ప్రేక్షకులు అందరూ ఓన్ చేసుకున్నారు. శ్రీనివాస్ హీరోగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో గుడ్‌విల్ సినిమా పతాకంపై భీమనేని రోషితాసాయి సమర్పణలో భీమనేని సునీత నిర్మించిన చిత్రం ‘స్పీడున్నోడు’. ఈ చిత్రం ఫిబ్రవరి 5న వరల్డ్‌వైడ్‌గా భారీ ఓపెనింగ్స్‌తో రిలీజ్ అయి సూపర్‌హిట్ టాక్ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘తెలుగు360.కాం’ జరిపిన ఇంటర్వ్యూ.
ప్రేక్షకుల మధ్య ఈ సినిమా చూశారా?
– మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ప్రేక్షకుల మధ్య థియేటర్లో ఈ సినిమాను చూశాను. ప్రతిఒక్కరూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తున్నారు. లాస్ట్ 10 నిమిషాలు క్లైమాక్స్ హైలైట్‌గా ఉంటుంది. అందరూ పిన్‌డ్రాప్ సైలెన్స్‌తో వుండిపోయారు. ప్రతిఒక్కరి కళ్లలో నీళ్లు చూశాను. మా ఫ్రెండ్స్ అంతా భలే చేశావ్‌రా అని అప్రీషియేట్ చేశారు.
మీ అమ్మానాన్న సినిమా చూసి ఏమన్నారు?
– మా అమ్మ సినిమా చూసి అలా నిల్చుని నన్ను చూస్తూ ఉండిపోయింది. నాన్న అయితే గట్టిగా హగ్ చేసుకున్నారు. ఆర్టిస్ట్‌గా బాగా ఇంప్రూవ్ అయ్యాక పర్ఫామెన్స్ ఇరగదీశావ్ అని మూవీ చూసి అందరూ అభినందించారు. రెండో చిత్రమే ఇలాంటి మంచి కథాబలం ఉన్న సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది.
ఈ సక్సెస్ ముందే ఊహించారా?
– ఆల్రెడీ తమిళంలో సుందరపాండ్యన్ బిగ్గెస్ట్ హిట్ అయింది. ‘అల్లుడు శ్రీను’ తర్వాత 30, 40 కథలు విన్నాను. ఏదీ సరిగ్గా నచ్చలేదు. ‘సుందరపాండ్యన్’ సినిమా చూశాక లాస్ట్ పది నిమిషాల క్లైమాక్స్ నన్ను వెంటాడింది. అంత త్వరగా సినిమాని మర్చిపోలేక పోయాను. పర్సనల్‌గా నాకు బాగా నచ్చిన చిత్రం ఇది. భీమనేనిగారు వచ్చి కథ చెప్పగానే ఇమీడియట్గా ఓకే చేశాను.
ఈ టైటిల్ మీకు కరెక్ట్‌గా యాప్ట్ అని భావిస్తున్నారా?
– కథనే కాకుండా నా బాడీలాంగ్వేజ్‌ని దృష్టిలో పెట్టుకుని భీమనేని గారు ఈ టైటిల్‌ని ఫిక్స్ చేశారు. సెట్లో సీన్ చెప్పినా, డ్యాన్స్ మూమెంట్ చేసినా, ఫైట్ సీన్స్ చేసినా అన్నీ చాలా ఫాస్ట్‌గా చేసేవాడ్ని. అదిచూసి భీమనేనిగారు ముందు నాలుగు టైటిల్స్ అనుకున్నా ఫైనల్‌గా ‘స్పీడున్నోడు’ కన్ఫర్మ్ చేశారు. ఎవరికైనా సెట్ అయ్యే కథ ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే మంచి కథాబలంతో తీసిన సినిమా ఇది.
మీ రెండో సినిమానే రీమేక్ చిత్రాన్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి?
– పర్టిక్యులర్‌గా రీజన్ అంటూ ఏం లేదు. సినిమా కంటెంట్ నచ్చింది. రీమేక్ చిత్రాలు చాలా ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఫ్రెష్‌గా సబ్జెక్ట్‌ని రెడీచేశారు భీమనేని గారు. ఒక మంచి సినిమా చేయాలని చేశాం. మా డాడీ, నేను ఇద్దరం శాటిస్ఫై అయ్యాం. కెరీర్ మొదట్లో కొత్త యాక్టర్‌కి ఫస్ట్ 3, 4 చిత్రాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న కాంపిటీషన్లో నిలదొక్కుకోవాలంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేయాలని, ది బెస్ట్ అవుట్‌పుట్ రావాలని టెక్నీషియన్స్ డేట్స్ కుదరకపోయినా కాంప్రమైజ్ అవకుండా మేం అనుకున్న వారినే పెట్టి సినిమా చేశాం.
తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయడానికి కారణం?
– తను మంచి ఫ్రెండ్. మంచి డ్యాన్సర్. ఈ స్పెషల్ సాంగ్ తమన్నా చేస్తే బాగుంటుంది అని అప్రోచ్ అయ్యాం. తమన్నా ఈ సాంగ్ చేయడం చాలా హ్యాపీగా వుంది.
హీరోయిన్ సోనారిక పర్ఫామెన్స్ గురించి?
– ఈ కథకి చాలా ఫ్రెష్‌లుక్ ఉన్న అమ్మాయి అయితే బాగుంటుంది అనిపించి సోనారికను సెలక్ట్ చేశాం. వెరీ గుడ్ పర్ఫార్మర్. సినిమా బాగా యాక్ట్ చేసింది.
ఈ సినిమా కోసం ఎలాంటి కేర్ తీసుకున్నారు?
– నా హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, లుక్వైజ్, డాన్స్, ఫైట్స్ అన్నింట్లో చాలా కేర్ తీసుకుని ప్రెస్టీజియస్‌గా చేశాను. డబ్బింగ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నాను.
మీ నాన్నగారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు వుంది?
– ఈ సినిమాకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ భీమనేని శ్రీనివాస్ గారే కాబట్టి అన్నీ ఆయనే చూసుకున్నారు. బిజినెస్ సైడ్ నాన్నగారు హెల్ప్‌చేశారు. ప్రేక్షకులకు సినిమా బాగా రీచ్ అవ్వాలని పబ్లిసిటీ, మార్కెటింగ్ సైడ్ నాన్నగారు చూసుకుంటున్నారు.
మీ క్యారెక్టర్‌కి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?
– చాలా ఎనర్జిటిక్ క్యారెక్టర్. కర్నూలు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఓ కుర్రాడి కథ. ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేసే క్యారెక్టర్ హీరోది. ఫ్రెండ్ ఫోన్‌చేస్తే ఇమీడియట్గా వచ్చి వాడి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే క్యారెక్టర్. అమ్మాయిలను ప్రేమలో పడేయటంలో ఎక్స్పర్ట్. ఏ సమస్య అయినా డీల్ చేయడంలో ఎక్స్పర్ట్. అలాంటి ఒక ఎనర్జిటిక్ క్యారెక్టర్లో నటించాను. నా క్యారెక్టర్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది.
భీమనేని శ్రీనివాసరావు గారితో వర్క్ చేయడం ఎలా వుంది?
– భీమనేని గారు పెద్ద హీరోలందరితో వర్క్ చేశారు. చాలా సీనియర్ డైరెక్టర్. ఎంత ఎదిగినా కూడా ఒదిగి వుండే మనస్తత్వం ఆయనది. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎమోషనల్ సీన్స్ చేయడంలో ఆయన ఎక్స్పర్ట్. సినిమా అంటే ఎంతో ప్యాషన్ వున్న వ్యక్తి. ఎన్ని సినిమాలు చేసినా ఇది ఫస్ట్ ఫిలింలాగే కష్టపడి చేశారు.
వసంత్ మ్యూజిక్ ఎంతవరకు హెల్ప్ అయింది?
– ఈ సినిమా కోసం వసంత్ 80 ట్యూన్స్ కంపోజ్ చేశాడు. అందులో 8 ట్యూన్స్ ఓకే చేశాం. సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా రీ రికార్డింగ్ ఎక్స్ట్రార్డినరీగా చేశారు. కెమెరామెన్ విజయ్ వండర్ఫుల్ విజువల్స్ ఇచ్చారు. ప్రతిఒక్కరూ జెన్యూన్‌గా కష్టపడి చేశారు. ఈ సినిమా నాకు మంచి పేరు తేవాలి అని ప్రతి ఒక్కరూ చేశారు. నా కెరీర్లో ‘స్పీడున్నోడు’ లాంటి మంచి సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా వుంది.
మూడవ సినిమా ఎవరితో?
– బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో సినిమా చేస్తున్నాను. ఆ వివరాలు త్వరలో చెబుతాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.