బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు ఐదు లక్షల జరిమానా విధించింది. దీనికి కారణం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తున్న న్యాయమూర్తికి బీజేపీతో సంబంధాలు అంటగట్టి ఆరోపణలు చేయడమే. ఆయన విచారణ చేయవద్దని కోరడమే. ముఖ్యమంత్రి తీరు ఖచ్చితంగా కోర్టులకు ఉద్దేశాలను ఆపాదించడమేనని.. భావిస్తూ.. న్యాయమూర్తి ఐదు లక్షల జరిమానా విధించారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతే కాదు.. న్యాయవాద వర్గాలన్నింటి చర్చ.. ఈ తీర్పుతో పాటు..ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. గతంలో సుప్రీంకోర్టు , హైకోర్టు న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదిస్తూ.. రాసిన లేఖల వైపు వెళ్తోంది.
అ్కకడ మమతా బెనర్జీపై అంత ధైర్యంగా జరిమానా వేయగలిగిన హైకోర్టు..ఇక్కడ అంత కంటే ఘోరంగా… న్యాయవ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం ఎందుకంత సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తోందన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సీఎం జగన్.. అనేకానేక ఆధారాలు లేని ఆరోపణలతో అప్పటి చీఫ్ జస్టిస్కుఓ లేఖ రాశారు. దాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. అవన్నీ… మీడియాలో విస్తృతంగా ప్రసారం అయ్యాయి. చీఫ్ జస్టిస్ కావాల్సిన ఓ న్యూయమూర్తిని ఆయన టార్గెట్ చేసి.. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనా అభియోగాలు చేశారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.
జగన్మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని… తీవ్రమైన నేరాల్లో నిందితుడిగా ఉన్న ఆయనను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే ఎ వైపు నుంచీ ఆయనకు కోర్టుల నుంచి ఇబ్బంది రాలేదు. ఇప్పటికే.. ఆయన పార్టీ.. కోర్టులకు ఉద్దేశాలు ఆపాదిస్తూనే ఉంటుంది. ప్రస్తుతానికి ఆయన అప్పటి చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖ పై దాఖలైన ఓ కేసు మాత్రం విచారణలో ఉంది. సమయం కావాలని ఏపీ సర్కార్ కోరడంతో వాయిదా పడింది. మమతా బెనర్జీ విషయంలో చురుగ్గా స్పందిన న్యాయవ్యవస్థ అంత కంటే దారుణమైన తప్పిదానికి పాల్పడిన ఏపీ సీఎం విషయంలో ఇంకెలా స్పందిస్తుందో చూడాలన్న ఉత్సుకత నెటిజన్లలో కనిపిస్తోంది.