మాస్ మహరాజ్ రవితేజ సినిమాలో హీరోయిన్స్ కొంచం స్పైసీగా ఉంటారన్న సంగతి తెలిసిందే. కేవలం మాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని హీరోయిన్ స విషయంలో జాగ్రత్త పడతాడు మన మాస్ హీరో. ఈ ఇయర్ కిక్-2 ద్వారా తన ఫ్యాన్స్ ని నిరాశ పరిచాడు అందుకే లేటెస్ట్ బెంగాల్ టైగర్ తో అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు రవితేజ. ఇక హీరోయిన్స్ గా నటిస్తున్న తమన్నా, రాశి ఖన్నాలైతే ఎవరికి వారు రెచ్చిపోయి సినిమాకి మరింత గ్లామర్ తెచ్చారు.
సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. భీమ్స్ మ్యూజిక్ అందించిన బెంగాల్ టైగర్ సంగీతం కూడా శ్రోతలను అలరిస్తుంది. రచ్చ సినిమాతో తమన్నాని హాట్ గా చూపించిన సంపత్ ఈ సినిమాలో కూడా తమ్మూని అదిరిపోయేలా చూపిస్తున్నాడు. తమన్నా అందాలు హైలెట్ గా నిలిచే ఈ సినిమా అమ్మడు స్పెషల్ ఎట్రాక్షన్ అవ్వనుంది. ఇక ఈ సినిమాతో మరోసారి తన అదృష్టం పరిక్షించుకుంటుంది రాశి ఖన్నా. జిల్, శివమ్ సినిమా ఫ్లాప్స్ తో డీలా పడ్డ రాశి ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఏమాత్రం దాచుకోకుండా అందాల ప్రదర్శన చేసింది.
మరి ఇద్దరు ఇద్దరే అన్నట్టు అందాల ప్రదర్శన తో అదరగొడుతుంటే, తన మాస్ డైలాగులతో సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాడు రవితేజ. ఈ నెల 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రవితేజ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.