బెంగాల్లో మరో మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ మూడు విడతల్లోనూ ఇక బెంగాల్ పోలీసుల సేవలను.. ఎన్నికల సంఘం ఉపయోగించుకోకూడదని నిర్ణయించుకుంది. కేవలం కేంద్ర భద్రతా దళాల పహారాలో మాత్రమే.. ఎన్నికలు జరపాలని ఈసీ .. ఆదేశాలు జారీ చేసింది. నాలుగు విడతలుగా.. బెంగాల్లో… ఇప్పటికి ఎన్నికలు జరిగాయి. అయితే.. ప్రతీ సారి హింస చెలరేగుతోంది. ఈ కారణాన్ని చూపి.. స్థానిక పోలీసులు … అల్లర్లను కట్టడి చేయలేకపోతున్నారని.. డిసైడ్ చేసుకుని… పూర్తిగా… ఆ రాష్ట్ర పోలీసులను.. ఆ రాష్ట్ర ఎన్నికల్లో వాడుకోకూడదని డిసైడయింది.
ఇప్పటి వరకూ.. అక్కడ కేంద్ర బలగాలు లేవా.. అనే అనుమానం.. ఈసీ నిర్ణయం తర్వాత సహజంగానే వస్తుంది. కానీ.. అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగానే… బెంగాల్‌కు కేంద్ర బలగాలు వెళ్లాయి. అయితే.. అక్కడ స్థానిక పరిస్థితుల్ని .., స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మూడు విడతలుగా జరగబోయే ఎన్నికల్లో మాత్రం.. బెంగాల్ పోలీసులకు ఎలాంటి పాత్రా ఉండదు. ఈసీ నిర్ణయం సహజంగానే రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నికల కోడ్.. అల్లర్లు తదితర అంశాలను.. విపక్ష పార్టీల నేతలు ఉన్న చోటనే హైలెట్.. దానికి అనుగుణంగా.. బీజేపీ డిమండ్లపై నిర్ణయాలను ఈసీ తీసుకోవడం… అనేక అనుమానాలకు తావిస్తోంది.
సహజంగానే.. బెంగాల్ ఉద్రిక్తతల రాష్ట్రం. ఎన్నికలు ఎప్పుడూ ఆ రాష్ట్రంలో ప్రశాంతంగా జరిగిన దాఖలాలు లేవు. అందుకే.. 42 పార్లమెంట్ స్థానాలే ఉన్నప్పటికీ.. ఏకంగా ఏడు విడతల్లో పోలింగ్ పెట్టారు. పెద్ద ఎత్తున బలగాలను మోహరించినప్పటికీ.. హింసను మాత్రం అరికట్టలేకపోయారు. ఇప్పుడా బాధ్యత అంతా.. బెంగాల్ పోలీసులపైకి నెట్టేసి.. కేంద్ర బలగాల గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. కొద్దిరోజులుగా.. మమతా బెనర్జీ.. కేంద్ర బలగాల తీరుపై ఆరోపణలు చేస్తున్నారు. పోలింగ్ బూత్‌లలో కూర్చుని.. ఉత్తరాదికి చెందిన భద్రతా సిబ్బంది.. బీజేపీకి ఓటేయమని… ప్రజలను బెదిరిస్తున్నారని… ఆమె ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అసలు పోలింగ్ వ్యవహారాలను… కేంద్రబలగాలు టేకోవర్ చేయబోతున్నాయి. అయినా హింస చెలరేగితే.. ఈసీ ఏం చేస్తుందో చూడాలి..!