బెంగుళూరులో రేవ్ పార్టీని భగ్నం చేశారు అక్కడి పోలీసులు. బడాబాబుల కార్లు, పలువురు సెలబ్రిటీలను, మోడళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఓ బడా పారిశ్రామికవేత్తకు చెందిన బెంగుళూరు సిటీ శివారులోని ఫాంహౌజ్ లో రేవ్ పార్టీ జరుగుతుందని తెలుసుకొని పోలీసులు దాడి చేశారు.
అయితే, బెంగుళూరు రేవ్ పార్టీలోనూ వైసీపీ నేతల పేర్లు బయటకు రావటం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు కూడా అక్కడ దొరికింది. 2023 వరకు వ్యాలిడిటీ ఉన్న స్టికర్ అది. అంతేకాదు వైసీపీ ఎమ్మెల్యేకు చెందిన పాస్ట్ పోర్టు కూడా ఓ కారును తనిఖీ చేస్తుండగా దొరికినట్లు తెలుస్తోంది. అయితే, ఆ పాస్ పోర్టు ఎవరిది అనేది తెలియాల్సి ఉండగా… ఎమ్మెల్యే స్టిక్కర్ పై మంత్రి కాకాని స్పందించారు.
ఆ స్టిక్కర్ ఓరిజినల్ దేనా, నకిలీదా అనేది పోలీసులు తేలుస్తారని… ఆ పార్టీతో నాకు సంబంధం లేదని కాకాని మీడియాకు చెప్పారు. మంత్రి ఎంత చెప్పినా రీసెంట్ గా గడువు ముగిసిన ఎమ్మెల్యే స్టిక్కర్ వాడింది ఎవరు?, అసలు ఆ కారు ఎవరి పేరుపై ఉంది, మంత్రిగారి ఎమ్మెల్యే స్టిక్కర్ తో పాటు ఓ వైసీపీ ఎమ్మెల్యే పాస్ పోర్టు ఎవరిది అన్న వివరాలు బయటకు రావాల్సి ఉంది.
ఈ పార్టీని హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి ఏర్పాటు చేయగా… దీని వెనుక ఏపీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నారని తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే చెప్పటంతోనే వాసు ఈ పార్టీకి అరెంజ్మెంట్స్ చేశారని, ఇందుకోసం విమానంలో కొంతమంది యువతను బెంగుళూరు రప్పించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం 15మంది యువతలను అదుపులోకి తీసుకోగా…. రేవ్ పార్టీ దగ్గర ఖరీదైన 15కార్లను పోలీసులు గుర్తించారు.