అదానీ కంపెనీల్లో డొల్ల సంస్థల పెట్టుబడుల వ్యవహారం వెలుగులోకి రావడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అదానీ లిస్టెడ్ కంపెనీల్లో షేర్లను కొనుగోలు చేస్తూ.. కృత్రిమ ధరల పెంపునకు పాల్పడుతోన్న విదేశాల్లోని ఇన్వెస్టర్లు హఠాత్తుగా మాయమయ్యారు. అదానీ సంస్థలలో షేర్లను కొనుగోలు చేస్తోన్న ఎనిమిది విదేశీ ఫండ్లలో ఆరు సంస్థలు మాయమయ్యాయని మింట్ పరిశోధనాత్మక కథనం ప్రచురించింి. ఇందులో బెర్ముడా, మారిషస్ ఫండ్ సంస్థలున్నాయి.
అదానీ గ్రూపులో డొల్ల, దొంగ పెట్టుబడులపై ఇటీవల ఆర్డనైజ్డ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఒసిసిఆర్‌పి) ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. అదానీ గ్రూప్‌లో రహస్యంగా పెట్టుబడి పెట్టిన ఇద్దరు వ్యక్తులు.. అదానీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని వెల్లడించింది. గౌతం అదానీ సోదరుడు వినోద్ అదానీ సంస్థల్లో పెట్టుబడులు కలిగి ఉన్నారని పేర్కొంది. సెబీ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిపింది. అదానీ అక్రమాలపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్ట్‌పైనా సుప్రీంకోర్టు విచారిస్తోంది. సుప్రీం ఆదేశాల మేరకు అదానీ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులపైనా సెబీ దర్యాప్తు జరుపుతోంది.
డొల్ల కంపెనీల పేరుతో… ఇండియాలోకి బ్లాక్ మనీని పెద్ద ఎత్తున డంప్ చేసారన్న ఆరోపణలు రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ డొల్ల కంపెనీలు కనిపించకుండా పోవడం అనుమానాలకు బలమిస్తోంది. విదేశీ పెట్టుబడులకు సంబంధించి మరింత సమాచారం దొరకాల్సి ఉందని సెబీ ఇటీవల అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లోనూ పేర్కొంది. అదానీ కంపెనీ షేర్లలో విదేశీ పెట్టుబడులపై విచారిస్తోన్న సెబీకి అదృశ్య ఇన్వెస్టర్లను కనుగొనడం పెద్ద సవాల్‌గా మారనుంది. సెబీ నిజాలు వెలికి తీయాలంటే రెండు గంటల పని అని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అదానీ పెట్టుబడులు ఎలాంటివో బహిరంగ రహస్యమే. కానీ ఆయన వపర్ కారణంగా అందరూ కళ్లు మూసుకున్నారు.