దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అనిశ్చితి కారణంగా ఆయా రంగాల్లోని వ్యాపార సంస్థలు మనీ రొటేషన్ కోసం అయినా అమ్మకాలు తగ్గకుండా చూసుకుంటున్నాయి. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి. డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మెరుగుపడుతోంది. ఎంక్వయిరీలు పెరుగుతున్నాయి. వాటిని చివరి కొనుగోలు వరకూ తీసుకెళ్లేలా కొత్త కొత్త ఆఫర్లను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఇస్తున్నాయి.
ప్రైజ్ అపార్టుమెంట్లు నిర్మిస్తున్న బడా సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు ముందస్తు బుకింగ్ కన్నా కాస్త తగ్గించేందుకు కొత్త కనుగోలుదారులకు అవకాశం ఇస్తున్నట్లుగా పలువురు సోషల్ మీడియాలో చెబుతున్నారు. ఇల్లు కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్ అని.. అయితే డిస్కౌంట్లు, ఆఫర్లు పొందడానికి కూడా ఇదే మంచి సమయం అంటున్నారు. ఆరు నెలల కిందటితో పోలిస్తే ధరలు పెద్దగా పెరగలేదు కానీ.. అప్పటి ధర మీద ఆఫర్లు ఇచ్చేందుకు కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయి.
బడా సంస్థలు కాకుండా.. ఇతర చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు, బిల్డర్లు లాభం తగ్గించుకుని అమ్ముకునేందుకు రెడీ అంటున్నారు. దీనికి కారణం వారు పెట్టిన పెట్టుబడికి వడ్డీ పెరిగిపోవడం. మనీ రొటేషన్ జరగకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందుకు సాగదు. అందుకే చాలా మంది.. కాస్త లాభం తగ్గించుకుని అయినా ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నారు.
ఇంటి కొనుగోలుకు ఇంత కంటే మంచి సమయం ఉండదని.. భూమ్ ఊపందుకున్న తర్వాత ఇప్పుడు వారు ఇచ్చిన డిస్కౌంట్లు, ఆఫర్లను కూడా కవర్ చేసుకునేలా రేట్లు పెంచుతారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇల్లు కొనుగోలుకు ఇదే బెస్ట్ టైం అని సలహాలిస్తున్నారు.