కరోనా తర్వాత ఆరు శాతం వరకూ దిగిపోయిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇప్పుడు తొమ్మిది శాతానికి చేరుకున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడంతో గత ఏడాదిన్నర కిందట వడ్డీ రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడినా వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో ఆర్బీఐ తొందర పడటం లేదు. రేట్లు స్థిరంగా ఉంచాలనే ఆర్బీఐ అనుకుంటోంది రియల్ ఎస్టేట్ పరిశ్రమ వడ్డీ రేటు తగ్గింపు కోసం ఎదురు చూస్తోంది.
ప్రస్తుతం, గృహ రుణ వడ్డీ రేట్లు 9 నుంచి 9.25% మధ్య ఉన్నాయి, ఇది చాలా మంది రుణగ్రహీతలను మరికొంత కాలం ఎదురు చూసేలా చేస్తోంది. చాలా మంది రేటు తగ్గింపును ఆశిస్తున్నారు. ఆర్బీఐ కూడా డిసెంబర్లో తగ్గింపును ఆశించవచ్చని సంకేతాలు పంపుతోంది. దీంతో రుణ సంస్థలు ముందస్తుగా మార్కెట్ పొందేందుకు వడ్డీరేట్లను కొత్తగా లోన్ తీసుకునే వారికి తక్కువగా ఆఫర్ చేస్తున్నాయి. 2023లో అతి స్వల్ప వడ్డీల రేట్ల రికార్డు స్థాయిని చవిచూసిన తర్వాత ఇబ్బంది పడిన ఇళ్ల కొనుగోలుదారులకూ రిలీఫ్ వచ్చే అవకాశంఉంది.
అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా రియార్టీ డౌన్ ట్రెండ్ లో ఉంది. 2024 చివరి మూడు త్రైమాసికాలలో ప్రాపర్టీ అమ్మకాలు తగ్గిపోతున్నాయని రిపోర్టులువస్తున్నాయి.ల అందుకే రెపో రేటులో తగ్గింపు ఖాయమని.. రియాల్టీని ఆర్బీఐ ప్రోత్సహిస్తోందని ఓ అంచనాకు వస్తున్నారు. గృహ రుణాలపై వడ్డీని తగ్గించడంలో వడ్డీ రేటు కీలకం. రెపో రేటు ఎంత తగ్గించినా అది ఇళ్లు కొన్నవారికి.. కొనే వారికీ మేలు చేస్తుంది. అందుకే ఎక్కువ మంది డిసెంబర్ కోసం వెయిటింగ్.