బిల్డర్లు అపార్టుమెంట్ కొనుగోలు చేయడం మంచిదా లేకపోతే స్నేహితులు పది మంది వరకూ కలిసి గ్రూప్ హౌస్ కట్టుకోవడం బెటరా ?. అన్న చర్చలు ఇళ్లు కొనుక్కోవాలనుకునే స్నేహితుల మధ్య తరచూ వస్తూంటాయి. అయితే చాలా మంది వేవ్ లెంగ్త్ కుదరదని చెప్పి బిల్డర్లు కట్టిన అపార్టుమెంట్లకు ఫిక్సయిపోతూంటారు. కానీ అందరూ కాస్త సావధానంగా ఆలోచించుకుని.. అందరి ఆలోచనలకు తగ్గట్లుగా ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసుకుంటే.. గ్రూప్ హౌస్ నిర్మించుకోవడం చాలా లాభం.
పది ఫ్లాట్లు ఉండేలా అపార్టుమెంట్ నిర్మించేది బిల్డర్ మాత్రమే కాదు. ముందుగా పది మంది కొనుగోలుదారులు కలిసి ఓ గ్రూపుగా ఏర్పడి స్థలం కొనుగోలు దగ్గర నుంచి నిర్మాణం వరకూ అన్నీ చూసుకోవచ్చు. దాన్ని గ్రూప్ హౌస్ అనుకోవచ్చు. ఇక్కడ బిల్డర్లు ఎవరూ ఉండరు. అందరూ బిల్డర్లే. అంటే ఎవరింటిని వారు నిర్మించుకున్నట్లే. ఉదాహరణకు ఓ ఆఫీసులో పని చేసే ఓ పది మంది ఇల్లు కొనేందుకు సిద్దమయ్యారు. వారు తమ అభిరుచులు,బడ్జెట్ కు అనుగుణంగా ఉండే ఇల్లును వెదుక్కోవడం కష్టం. అందుకే పది మంది ఓ గ్రూపుగా ఏర్పడి.. స్థలం కొనుక్కుని పది ఫ్లాట్లు నిర్మించుకుంటారు. లాటరీ ద్వారానో.. మ్యూచువల్ అండర్ స్టాండింగ్ ద్వారానో ఫ్లాట్లు కేటాయించుకుంటారు.
ఇది చాలా లాభదాయకమైన విధానం. ఇలా చేస్తే ఒక్కో ఫ్లాట్ కు రూ. పది లక్షల వరకూ కలసి వస్తుంది. ఎక్స్ ట్రా ఖర్చులు ఉండవు.ఇప్పుడు బయట బిల్డర్ దగ్గర ఓ ఫ్లాట్ కొంటే.. కార్ పార్కింగ్ దగ్గర నుంచి చాలా ఖర్చులువసూలు చేస్తారు . ఎలా ఎవరికివారు ఓ గ్రుపుగా ఏర్పడి కట్టుకుంటే ఎక్స్ ట్రా ఖర్చులు ఉండవు. అదే సమయంలో అన్నీ క్వాలిటీగా నిర్మించుకోవచ్చు. చిన్నచిన్న బిల్డర్లు నాసిరకం సామాన్లు వాడతారు. ఇపుడు అసలు కట్టుబడిలో ఇసుకే వాడటం లేదు. రాబోశాండ్ మాత్రమే వాడుతున్నారు.
అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. చిన్నఅభిప్రాయ బేధం కూడా రాకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు అందరూ మాట్లాడుకుంటూ పనులు చేసుకోవాలి. ఒకరితో ఒకరికి విబేధాలు వస్తే ఇంటినిర్మాణంపై ప్రభావం పడుతుంది. ఇల్లు పూర్తయిన తర్వాత సమస్యలొస్తే పరిష్కరించుకున్నా.. పరిష్కరించుకోకపోయినా అది వారి ఇంటిపై ప్రభావం పడదు.