ఓ దశాబ్దం కిందట ఇల్లు అంటే గదుల్లో అల్మారాలు ఉంటే చాలు. బయట నుంచి బీరువా కొనుక్కొచ్చి పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు అండ్.. మొండిగోడలతో ఉన్నది సగం మాత్రమే. మిగిలిన సగం ఇంటీరియల్స్. ఇంటికి యాభై లక్షలు ఖర్చు పెడితే కనీసం ఇరవై లక్షలు ఇంటీరియర్స్ కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కొనుగోలుదారులలో మారుతున్న అభిరుచుల ప్రకారం ఇంటీరియర్స్ మార్కెట్ కూడా విపరీతంగా పెరుగుతోంది.
ఈ క్రమంలో స్టార్టప్స్ పుట్టుకొచ్చేశాయి. హోమ్ లేన్, లివ్ స్పేస్ సహా అనేక సంస్థలు ఇంటిరియర్ సేవలు అందిస్తామని ముందుకు వస్తున్నాయి. నిపుణులతో ప్రజెంటేషన్ ఇప్పించి క్వాలిటీగా పనులు చేస్తామని అంటున్నాయి. అయితే ఇప్పటికీ ఈ రంగంలో స్థానిక మేస్త్రీలదే కీలక పాత్ర. వడ్రంగి పని చేసే వాళ్లు మరితం స్కిల్స్ పెంచుకుని ఇంటీరియర్ రంగంలోకి తమదైన ముద్ర వేస్తున్నారు. వీరి డిజైన్లు ప్రొఫెషనల్స్ కు ఏ మాత్రం తీసిపోవు.
స్టార్టప్ సేవలు పూర్తిగా టెక్నికల్ అంశాలపై ఆధారపడి ఉంటున్నాయి. వారు కేవలం ఇంజినీరింగ్ ఉడ్ వాడతారు. అది అంత క్వాలిటీది కాదని ఎక్కువ మందినమ్ముతున్నారు. మేస్త్రీలు మాత్రం ప్లైవుడ్ వాడతారు. మంచి కాస్ట్ లీ ప్లైవుడ్ తో ఇంటీరియర్ చేయించుకుంటే ఎక్కువ కాలం ఉంటుందని కొత్తగా ఇల్లు కొనేవాళ్లు అనుకుంటున్నారు. ధర కూడా తక్కువగానేఉంటుంది. స్టార్టప్లలలో సాదాసీదాగా ఒక డబుల్ బెడ్ రూం ఇంటికి ఫర్నీచర్ చేయించుకోవాలంటే..ఎనిమిది నుంచి పది లక్షలు చెబుతారు. కానీ అంత కంటే క్వాలిటీ వర్క్ ను మేస్త్రీలు ఆరేడు లక్షల్లో పూర్తి చేస్తారు.
ఇప్పటికి ఈ విషయంలో స్టార్టప్‌లు అనుకున్నంతగా ముందడుగు వేయలేదు. లోకల్ మేస్త్రీలతో టై అప్ అయితే..మరింత ఎక్కువగా క్రియేట్ డిజైన్లతో సేవలు అందించే అవకాశం ఉంది. ఇప్పటికైతే.. లోకల్ మేస్త్రీలను సంప్రదిస్తే తమకు నచ్చినట్లుగా చేయించుకోవచ్చని ఎక్కువ మంది ఇంటి యజమానులు నమ్మకంతో ఉన్నారు.