తిరుపతి లడ్డూ వివాదం వైసీపీని నిలువనా దహించి వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా హిందువులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరభారతంలో జగన్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తెలుసుకుంటే వైసీపీ నేతలకు నిద్రపట్టదు. జగన్ రెడ్డి .. తిరుమలను ఉపయోగించుకున్న తీరు… అవినీతి, అక్రమాలకు వాడుకున్న వైనం… అందర్ని నిశ్చేష్ఠుల్ని చేస్తోంది.
వైసీపీ అడ్డంగా దొరికిపోయింది. ఇప్పటికి ల్యాబ్ రిపోర్టులే బయటకు వచ్చాయి. కానీ మొత్తం సాక్ష్యాలను వెలికి తీశారు. ప్రీమియర్ కంపెనీ నెయ్యి ఎక్కడ నుంచి తెస్తుంది.. అల్ఫా కంపెనీ బటర్ ఆయిల్ ను ఎక్కడి నుంచి దిగుమతి చేసి..దాన్ని నెయ్యిగా మార్చి ఎలా సరఫరా చేసింది.. మొత్తం రికార్డులతో సహా దొరికిపోయారు. ఒక్కొక్కటి బయటపడేకొద్దీ వైసీపీ అంత కంటే లోతుకు పోతూ ఉంటుంది. ఇలాంటి సమయలో వైసీపీ నేతలు పిచ్చి పిచ్చి నేరెటివ్స్ తో ఎదురుదాడి చేయడం మానేసి.. తప్పు ఎవరో ఒకరి మీద తోసేసి.. వాళ్లను బలి పశువుల్ని చేసేసి.. తాను సర్వైవ్ అయ్యే ప్రయత్నాలు చేయడం బెటర్. జగన్ రెడ్డి మొదటి నుంచి చేసేది అదే.
చట్టపరంగా తీసుకునే చర్యలు ధర్మారెడ్డి , సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలతో పాటు దోచుకున్న మరికొంత మంది పై ఉంటాయి. కానీ రాజకీయంగా జగన్ కు మాత్రం ఇది ఊహించని దెబ్బ. హిందూ ప్రసాదం కూడా తినని జగన్ రెడ్డి… హిందువుల్లా ఫోజులు కొట్టేందుకు స్వామిజీల కాళ్ల మీద పడేవారు, ఇప్పుడా నాటకాలన్నీ నాశనం అయిపోయాయి. వైసీపీ కనీసం బతికాలంటే.. హిందువులకు క్షమామపణలు చెప్పడం మంచిది.