బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్లపై హైదరాబాద్ లోని మియా పూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే వీరు ఈ యాప్స్ ను ఇటీవలి కాలంలో కాకుండా చాలా కిందటే ప్రమోట్ చేశారు.
కొన్నాళ్ల కిందట రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరొకండ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ ప్రకటనలు టీవీ చానళ్లలో విస్తృతంగా ప్రసారం అయ్యాయి. అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు టీవీ సెలబ్రిటీలు, ఇన్ ఫ్లూయన్సర్లపై కేసులు పెడుతూండంటతో వారు ప్రమోట్ చేసిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దాంతో చిన్న వారినేనా.. పెద్ద వారిపై కేసులు పెట్టరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో పోలీసులు ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన బడా సెలబ్రిటీలపై కేసులు పెట్టారు.
ఈ కేసులు ఎంత వరకు నిలబడతాయో కానీ.. బెట్టింగ్ యాప్స్ సూత్రధారులు ఎవరో తెలుసుకునేందుకు వీరు ఇచ్చే సమాచారం ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే ఎప్పుడో ప్రమోట్ చేసిన దానికి ఇప్పుడు కేసులు పెట్టడం ఏమిటన్న అభ్యంతరాలనూ వారు వ్యక్తం చేసే అవకాశం ఉంది.