హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారందరిపై కేసులు పెడుతున్నారు. కేసులు పెడుతున్నారు కదా అని.. సెలబ్రిటీలు చేసిన ప్రోగ్రామ్స్‌కు బెట్టింగ్ యాప్స్ స్పాన్సర్స్ గా ఉంటే.. ఆ సెలబ్రిటీలను కూడా కేసుల్లో ఇరికించాలని కొంత మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ బెట్టింగ్ కేసుల వ్యవహారం బహుముఖాలుగా విస్తరిస్తూంటే.. మరో వైపు ఐపీఎల్ చూస్తున్న వారికి ప్రతి ఓవర్ బ్రేక్‌లోనూ బెట్టింగ్ యాప్స్ యాడ్సే కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ ఆడుతున్న ప్రతి ఒక్క స్టార్ ప్లేయర్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. చివరికి సిరాజుద్దీన్ కూడా కనిపిస్తున్నారు. పోకర్ బాజీ లాంటి యాప్స్ అయితే లెక్కలేనన్ని వచ్చాయి. అసలు డ్రీమ్ 11 అనే బెట్టింగ్ యాప్ టీమిండియాకు చాలా కాలం స్పాన్సర్ గా వ్యవహరించింది. ఐపీఎల్ అంటే బెట్టింగ్ అని అనుకుంటారు. ఇప్పుడీ యాప్ లు విశ్వరూపం చూపిస్తున్నాయి.
అవన్నీ ఇల్లీగల్ అయితే టెక్నికల్ గా వాటిని బ్యాన్ చేయాలి కానీ.. ప్రమోట్ చేస్తూ వీడియోలు తీసే వారిపై నిందలు వేయడం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బెట్టింగ్ యాప్ లను నిషేధించారు. కానీ ఆ యాప్ లు ఇక్కడివి కాదు., బెట్టింగులు కాదని.. స్కిల్ గేముల యాప్‌లను ప్రమోట్ చేసిన వారు చెబుతున్నారు. వారు చెప్పేది కూడా నిజమే. కానీ తెలంగాణ పోలీసులు మాత్రం తమ దారిలో తాము వెళ్తున్నారు. కానీ బెట్టింగ్ యాప్‌ల హవా మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.