తెలుగుదేశం పార్టీ నేతలు బెరుకు బెరుకుగా ఉన్నారు. వైసీపీ నేతలు దూకుడు మీద ఉన్నారు. వైసీపీ గెలుస్తుంది.. బెట్టింగ్ కి వస్తారా అంటూ… రెచ్చగొట్టేలా పరిస్థితి మారిపోయింది. టీడీపీ నేతలు మరింత బెరుకుగా.. మారి.. వారితో.. రూపాయికి.. రెండు, మూడు రూపాయలు ఇస్తాం అనిపించేలా చేసి.. అప్పుడు బెట్టింగ్ కడుతున్నారు. ఏపీలో ఎక్కడ చూసినా.. ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాల వారీగా వైసీపీ నేతలందరూ.. ఈ బెట్టింగ్ ట్రాప్‌లో పడినట్లు తెలుస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాతి రోజు.. పెద్దగా.. వైసీపీ నేతలు.. ఆసక్తి చూపలేదు కానీ.. చంద్రబాబు ఈవీఎంలపై పోరాటం అనే సరికి.. వారిలో ధైర్యం వచ్చింది.
ఐపీఎల్ బెట్టింగ్‌లను మించిపోయేలా భారీగా పందేలు కాసేందుకు డబ్బు సంచులతో సిద్ధమైపోయారు. ఫలితాలపై పార్టీలు, అభ్యర్థులు ఉత్కంఠకు గురవుతుంటే.. బెట్టింగ్ ట్రెండ్ మార్కెట్‌ను ఊపేస్తోంది. డిపాజిట్లు కోల్పోయేదెవరు.. మూడోస్థానంలో ఉండే పార్టీ ఏదన్నదానిపైనా భారీగా పందేలు కాస్తున్నారు. ఎన్నికల్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్నవారు మళ్లీ గెలుస్తారని బెట్టింగ్ పెట్టడం సహజం. ఈసారి ఇందుకు భిన్నంగా ఓడిపోయేదెవరన్న దానిపైనే ప్రధానంగా పందేలు కాయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఓ మంత్రి… ఓడిపోతారని.. ఆయన బంధువే.. పెద్ద ఎత్తున పందేలు కాస్తూడటం చాలా మందికి అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా.. ఓ పథకం ప్రకారం టీడీపీ నేతలు… ఆడుతున్న మైండ్ గేమ్ అన్న అనుమానం వైసీపీ నేతల్లో ప్రారంభమయింది.
తొలి దశలోనే ఎన్నికలు ముగియడంతో.. ఫలితాల కోసం మే 23 వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి. నవ్యాంధ్రలో పోలింగ్‌కు, ఫలితాలకు మధ్య 42 రోజుల వ్యవధి ఉండడంతో ప్రధాన పార్టీల అధ్యక్షులు, అభ్యర్థులకు గెలుపోటముల టెన్షన్ పట్టుకుంది. ఫలితాల వచ్చే వరకూ ఆగడమెందుకు.. మన భవిష్యత్ మనమే తెలుసుకుందామని కొంత మంది అభ్యర్థులు బూత్ ల వారీగా.. విశ్లేషణలు చేసుకుంటున్నారు. విజయంపై ధీమా కోసం పోస్ట్ పోల్ సర్వేపై దృష్టి పెట్టారు. తమ తమ నియోజకవర్గాల ప్రజలకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. మీ ఓటు ఎవరికి వేశారు అని తెలుసుకుంటున్నారు. తమకు ప్రధాన పోటీ అనుకున్న అభ్యర్థుల పేర్లు కూడా ప్రస్తావిస్తూ సర్వే చేయించుకుంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి.