ప్రీలాంచ్ ఆఫర్లలో జనం ఎలా పెట్టుబడులు పెడుతున్నారంటే.. ఎక్కువగా మౌత్ టాక్. బహిరంగ ప్రకటనల కన్నా.. మేము బుక్ చేసుకున్నాం. . ఇప్పుడు పాతిక లక్షలుపెడితే చాలు మూడేళ్లలో కోటి విలువ చేసే ఫ్లాట్ సొంత మవుతుంది.. అప్పటికి మనం కొనుక్కోలేం అని తెలిసిన వారు మోటివేట్ చేయడం వల్లనే ఎక్కువ మంది నష్టపోతున్నారు. వాళ్లే పెట్టారు కదా.. మనవి పోతే వాళ్లవీ పోతాయి కదా .. అంత రిస్క్ తీసుకోరులే అని ఎక్కువ మంది వీటికి ఆకర్షితులవుతున్నారు. అంటే ఒకరు మోసపోతూంటే.. వారిని చూసి మరొకరు మోసపోతున్నారు. ఇదో చైన్ సిస్టంలా జరుగుతోంది.
ఈ ప్రిలాంచ్ ఆఫర్లకు లాంగ్ టైమ్ ఉంది. మూడు, నాలుగేళ్లు గడువు పెట్టుకున్నారు. ఇంటిని రాత్రికి రాత్రి నిర్మించడం సాధ్యం కాదు అనే విషయాన్ని బిల్డర్లు చెబుతున్నారు కానీ.. గడువు ముంచుకు వస్తున్నా పనులు చేయకపోతున్న విషయాన్ని ప్రశ్నించడానికి మాత్రం అవకాశం కల్పించడం లేదు. డబ్బులు కట్టిన వారు కూడా గట్టిగా అడిగితే దిక్కున్న చోట చెప్పుకోండిఅని అంటారేమోనని భయపడి బతిమాలుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇలాంటి ప్రీలాంచ్ ఆఫర్లతో నష్టపోయిన వాళ్లు వేల మంది ఉన్నారు. వేల కోట్లు వసూలు చేశారు. వీరందరూ రియల్ ఎస్టేట్ మార్కెట్కు ఎవరూ చేయనంత నష్టం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి ప్రీ లాంచ్ మోసాల్ని అరికట్టేందుకు అధికార యంత్రాగం ముందుకు వస్తే తప్ప.. ఇల్లు కొనుగోలుదారులకు భరోసా లభించదు.