బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ మల్టీ స్టారర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకుడు. ఈ సినిమా టీజర్ ని వదిలారు. హీరోయిజాన్ని కృష్ణుడితో పోలుస్తూ జయసుధ వాయిస్ ఓవర్ లో ఓ ఫైట్ సీక్వెన్ ని చూపిస్తూ టీజర్ రివిల్ అయ్యింది. ముగ్గురు స్నేహితులు, ఓ గుడి చుట్టూ సాగే కథ ఇది.
టీజర్ లో యాక్షన్ కి పెద్దపీట వేశారు. శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ముగ్గురికీ స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్స్ సమపాళ్లలో దక్కాయి. అయితే ఇందులో శ్రీను క్యారెక్టర్ సెంటర్ అఫ్ ఎట్రాక్షన్. ఆ క్యారెక్టర్ చుట్టూనే డ్రామా వుంది. ముగ్గురి క్యారెక్టర్ లుక్స్ యాక్షన్ కి కథకి తగ్గట్టుగా వున్నాయి.
దర్శకుడు విజయ్ కనకమేడల గ్రిప్పింగ్ టీజర్ ని కట్ చేశారు. శ్రీ చరణ్ పాకాల స్కోర్ క్యాచిగా వుంది. అన్నట్టు.. టీజర్ చివర్లో కాంతార ఎఫెక్ట్ కనిపించింది. శ్రీను పూనకం వచ్చినట్లు ఊగే ఎపిసోడ్ ఎదో ప్లాన్ చేసినట్లుగా వున్నారు. టీజర్ లో అదే కొసమెరుపు.