ఒక సినిమా హిట్టైతే దానికి ఎంతమంది కారణమైనా ఆ సినిమా హీరోకి వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు. భలే భలే మగాడివోయ్ సినిమా హిట్ లో దర్శకుడు మారుతిది ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యత నానిది కూడా. సినిమా మొత్తం వన్ మ్యాన్ షోలా చేసి కలెక్షన్ల కుంబవర్షం కురిపించేలా చేశాడు. అయితే నాని ఈ సినిమాతో ఓవర్సీస్ లో కూడా తన సినిమాల మార్కెట్ పరిధిని పెంచుకున్నాడు. ప్రస్తుతం నానిని చూసి గుర్రుగా ఉన్నారు అందరు కుర్ర హీరోలు.
తమతోనే ఉంటూ ఒక్కసారిగా స్టార్ హీరోల మాదిరి సూపర్ హిట్ సినిమా కొట్టి వారికి తనకు మధ్య గ్యాప్ ఏర్పరచుకునేలా చేసుకున్నాడు. బయటపడక పోయినా నానిని చూసి కుర్ర హీరోలు చాలామంది ఈర్ష్యా.. అసూయలతో ఉన్నారనేది నిజం. భలే మగాడు లాంగ్ రన్ లో ఓవర్సీస్ కలక్షన్స్ తో కలుపుకుని దాదాపు 27 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఒక చిన్న హీరోగా ఇది చాలా పెద్ద హిట్.
ఇంతకుముందు నాని సినిమాలు కూడా ఏవీ 15 కోట్లకు మించి కలెక్ట్ చేసింది లేదు. కాని భలే భలే మగాడివోయ్ మాత్రం అంచనాలను తారుమారు చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఈ హిట్ తో నాచురల్ స్టార్ గా నాని స్టార్ స్టేటస్ ని సంపాధించాడనే అంటున్నారు. తన నెక్స్ట్ సినిమాలతో నాని ఇంకెన్ని సూపర్ హిట్స్ ఇస్తాడో చూద్దాం మరి.