ఫ్యామిలీ సెంటిమెంట్ తో కుమారుడి పరీక్షల పేరుతో బెయిల్ పొందాలని కల్వకుంట్ల కవిత చేస్తున్నప్రయత్నాలకు ఈడీ అధికారి భానుప్రియ మీనా స్వయంగా న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించి గండికొట్టే ప్రయత్నం చేశారు. సాధారణంగా బెయిల్ కోసం తప్పు చేయలేదని.. సాక్ష్యాలు లేవని వాదించి బెయిల్ తెచ్చుకుంటారు. అయితే ప్రధాన బెయిల్ పిటిషన్ పై విచారణ ఆలస్యమయ్యేలా ఉండటంతో మధ్యంతర బెయిల్ కవితకోరుకున్నారు. ఈ మధ్యంతర బెయిల్ ఎందుకంటే కొడుక్కి పరీక్షలు ఉన్నాయని.
కానీ ఈ కారణం కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందో లేదో కానీ కవితకు వ్యతిరేకంగా బలమైన వాదనల్ని జడ్జి ముందు వినిపించారు. ఈడీ అధికారులు. లిక్కర్ కేసు ప్లాన్ చేసింది కవిత. ఆధారాలను ధ్వంసం చేసిన వ్యక్తికి మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని వాదించారు. మధ్యలో ఈడీ జాయింట్ డైరెక్టర్ భాను ప్రియా మీనా స్వయంగా కవితకు వ్యతిరేకంగా సేకరించిన సున్నితమైన ఆధారాలను నేరుగా జడ్జి కావేరి బవేజాకు చూపించారు.
కవిత తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ అప్రూవర్ గా మారిన వ్యక్తిని బెదిరించారని భానుప్రియ మీనా జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షలు రాస్తోన్న కవిత కొడుకు వయసు చిన్నదేమీ కాదన్నారు. కొన్ని పరీక్షలు ముగిశాయని కూడా తెలిపారు. కవిత కుమారుడికి ఎగ్జామ్ యాంగ్జైటీ ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదన్నారు. 19 ఏండ్ల కవిత పెద్ద కొడుకు స్పెయిన్లో ఉన్నాడని, అరెస్టైన తల్లిని చూసి తాను వెళ్ళిపోయాడని తెలిపారు. కవిత తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు, ఐటీఆర్ వివరాలు, కుటుంబ వ్యాపార వివరాలు ఇవ్వడం లేదన్నారు.
మొత్తంగా కవితకు బెయిల్ రాకుండా.. భానుప్రియమీనా స్వయంగా కోర్టుకు సైతం వచ్చి వాదిస్తున్నారు. కవితను అరెస్టు చేసే సమయంలో కేటీఆర్ వాదన పెట్టుకున్నది ఈడీ అధికారి భానుప్రియ మీనాతోనే.