నటుడిగా బిజీగా ఉంటూనే, వీలున్నప్పుడు తన అభిరుచికి తగిన కథల్ని తెరకెక్కించి దర్శకుడిగానూ నిరూపించుకుంటున్నారు తనికెళ్ల భరణి. ప్రస్తుతం కె.రాఘవేంద్రరావు నటుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సెంచరీ సినిమాలు తీసిన దర్శకుడ్ని ఓ నటుడు డైరెక్ట్ చేయడమంటే మాటలు కాదు. ఓ రకంగా.. భరణికి దక్కిన విశేషమైన అవకాశమిది.
ఇప్పుడు మరో గోల్డెన్ ఛాన్స్ భరణికి దక్కింది. అమితాబ్ బచ్చన్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్. భరణి తీసిన `మిథునం` ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్, రేఖ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి భరణినే దర్శకుడు. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు భరణి. ఆరేళ్ల క్రితమే ఈ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని, ఇప్పుడు మెల్లమెల్లగా కార్యరూపం దాలుస్తున్నాయని చెప్పారాయన. అయితే ముందు రాఘవేంద్రరావు సినిమానే పూర్తవుతుంది. ఆ తరవాతే.. హిందీ `మిథునం` పట్టాలెక్కుతుంది.