సందేశాలు చెబితే వినే ఓపిక ఈరోజుల్లో ఎవరికీ లేదు. సుగర్ కోటెడ్ పిల్ టైపులో ఏదో కొత్తగా చెప్పాలి. ‘భరత్ అనే నేను’ రెండో పాట విషయంలో అదే జరిగింది. ‘ఐ డోంట్ నో’ అంటూ సాగే ఈ పాటలో ఎంతో చెప్పారు. జీవితం గురించి సింపుల్ గా వివరించారు. సాహిత్యంలో ఆంగ్ల పదాలు ఎక్కువయ్యాయనే విమర్శ పక్కన పెడితే… పాట ట్రెండీగా వుంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలో ఫర్హాన్ అక్తర్ వాయిస్ పాటకు భలే సెట్ అయ్యింది.
“యూనివర్స్ అనే ఎన్ సైక్లోపీడియాలో తెలుసుకున్న కొద్దీ వుంటాయి ఎన్నెన్నో…
ఆర్ట్ అఫ్ లివింగ్ అంటే ఆర్ట్ అఫ్ లెర్నింగ్ అంతే (జీవించడం అంటే నేర్చుకోవడమే)
నాకు తెలిసింది ఓ కొంత తెలియంది ఇంకెంతో.. ఐ డోంట్ నో”
“ఓన్లీ వన్ థింగ్ ఐ నో.. దేర్ ఈజ్ సొ మచ్ టు నో… (నీకు తెలిసింది ఒక్కటే… తెలుసుకోవాలని వున్నది చాలా వుంది)”
వంటి ఆంగ్ల సాహిత్యంతో ఈతరం పిల్లలకు అర్ధమయ్యే రీతిలో రామజోగయ్య శాస్త్రి పాటను రాశారు. సంగీతంలో, బాణీలో దేవి మార్క్ కనిపించింది. ప్రేక్షకులు ఈ పాటను విన్న వెంటనే హమ్ చేస్తారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. తొలిపాట రాజకీయం గురించి వుంటే… రెండో పాట సినిమాలో మహేష్ బాబు పాత్ర యొక్క వ్యక్తిగత జీవితం గురించి వివరించినట్టు వుంది. కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ రెండున విడుదల కానుంది.