ఇప్పుడందరి చర్చా.. ‘భరత్ అనే నేను’ సినిమాపైనే. బుధవారం విడుదల చేసిన టీజర్ చూశాక.. అందరి మైండూ బ్లాక్ అయిపోయింది. వరుసగా రెండు ఫ్లాపుల తరవాత.. మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా ఇది. ఆ లెక్కలన్నీ సరి చేసేలా ఉంది. ఇంత ఇంటెన్సిటీ ఉన్న టీజర్ ఈమధ్య కాలంలో రాలేదేమో. అనవసరమైన బిల్డప్ షాట్లూ, హీరోయిజం ఎలివేట్ అయ్యేలా డైలాగులు ఇవేం వాడకుండా.. సింపుల్‌గా క్లీన్‌గా చెప్పాల్సింది చెప్పేశాడు కొరటాల. ఓ విధంగా చెప్పాలంటే.. ఆడియన్స్‌కి ముందే ప్రిపేర్ చేసి ఉంచాడు.
టీజర్ చూశాక.. మహేష్‌ఫ్యాన్స్ లో ధైర్యం పెరిగింది. ఈ సినిమాపై నమ్మాకాలు ఏర్పాడ్డాయి. కచ్చితంగా ఈ వేసవిలో… భరత్ అనే నేను సంచలనాలు సృష్టించబోతోంది అనేది అర్థమైంది. కథలో దమ్మున్నప్పుడు మాత్రమే ఇలాంటి ట్రైలర్లు, టీజర్లు కట్ చేయొచ్చన్నది విశ్లేషకుల మాట. అదీ నిజమే. ఈ కథని మహేష్, కొరటాల అంత నమ్మారు. అసలు నిజం ఏమిటంటే.. ఈ కథ కొరటాలది కాదు. మరో రచయితదది. కొరటాల శివ స్వతహాగా కథకుడు. అయినా సరే మరొకరి నుంచి కథ కొనుక్కున్నాడు. ఏకంగా కోటి రూపాయలు ఇచ్చి. అంత ఇచ్చాక.. ఇంత ఇంటెన్సిటీ కనిపించకుండా ఎలా ఉంటుంది.? మరి టైటిల్స్‌లో రచయితకు క్రెడిట్ ఇస్తారో, క్యాష్తో సరిపెట్టేస్తారో చూడాలి.