టాలీవుడ్ హిస్టరీలో.. మహేష్ బాబు మూవీ భరత్ అనే ను సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం రెండు రోజుల్లోనే రూ. వంద కోట్లు కలెక్షన్లు సాధించి … నాన్ బాహుబలి …. సినిమాల్లో నెంబర్ వన్ గా నిలిచింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా … రిలీజ్ రోజు.. తర్వాత రోజు కలిపి రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ నమోదు చేసింది. మహేష్ ఈ ఫీట్ సాధించడానికి ఓవర్సీస్ మార్కెట్ ఎక్కుక ఉపయోగపడింది. అమెరికాలో రెండు రోజుల్లో రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది.
రెండు వారాల కింద విడుదలైన రామ్ చరణ్ – సుకుమార్ కాంబో.. రంగస్థలం … కూడా బీభత్సమైన హిట్ సాధించింది. అయితే రంగస్థలానికి వందకోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ రావడానికి నాలుగు రోజులు పట్టింది. తర్వాత కూడా మంచి కలెక్షన్లతో రన్ అయింది. అయితే.. రంగస్థలం రికార్డులను రెండు వారాల ముచ్చటగా మిగిల్చారు మహేష్ బాబు. భరత్ అనే నేను సినిమాలో.. రంగస్థలంరికార్డును అటు ఓవర్సీస్ లో..ఇటు డొమెస్టిక్ మార్కెట్ లనూ..అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.
సరైన సినిమా పడితే.. మహేష్ మార్కెట్ ఆకాశానికేనని..భరత్ అనే నేను సినిమాతో నిరూపితమయిందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉత్కంఠభరిత రాజకీయాల నడుమ… ఏ ఒక్క పార్టీని కానీ.. ఏ ఒక్క రాజకీయనాయకుడు గుర్తు రాకుండా పాత్రల చిత్రణ జరిపారు. స్టార్ హీరోని ఇలా కూడా చూపించవచ్చని… కొరటాల శివ నిరూపించారు.
అమెరికాలో ఇప్పుడు పూర్తిగా… భరత్ అనే నేను మూవి మానియానే నడుస్తోంది. స్క్రీన్ల సంఖ్యను అంతకంతకూ పెంచుతున్నారు. ఆదివారం… రోజు.. అమెరికాతో పాటు.. ఇండియాలో కలిపి… మరో రూ. 50 కోట్ల రూపాయల వసూలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి ఇప్పటికీ టాలీవుడ్ రంగస్థలం మీద.. రియల్ సినిమా “భరత్ అనే నేను” దే..!