హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న భారత్ బయోటెక్.. ప్రపంచంలోనే మొదటి కరోనా వైరస్ వ్యాక్సిన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అండ్ రీసెర్చ్..ఐసీఎంఆర్.. భారత్ బయోటెక్‌తో కలసి పని చేస్తోంది. కోవ్యాక్సిన్ పేరుతో.. భారత్ బయోటెక్ చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటికే జంతువులపై ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు మానవులపై క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభఇంచారు. ఇప్పటికే ప్రయోగదశలో పన్నెండు సంస్థలకు..వ్యాక్సిన్ టెస్టింగ్ కు పంపారు.
స్వాతంత్ర దినోత్సవం నాటికల్లా..కరోనా పోరులో విజయం సాధిస్తామని ఐసీఎంఆర్ ధీమా వ్యక్తం చేస్తోంది. వ్యాక్సిన్ మానవ ప్రయోగదశలోకి వచ్చిందని … ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఐసీఎంఆర్ చెబుతోంది. భారత్ బయోటెక్‌కు .. కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేస్తోంది. ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోసం… రేయింబవళ్లు పని చేస్తోంది. అక్కడ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉంటూడటంతో..ఆగస్టు పదిహేను కల్లా.. వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని అనుకుంటోంది.
అలాగే అహ్మదాబాద్ కేంద్రంగా పని చేస్తున్న జిడస్ క్యాడిల్లా హెల్త్ కేర్ సంస్థకు కూడా..హ్యూమన్ క్లినికర్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ అనుమతులు మంజూరు చేసింది. ప్రపంచంలోని అనేక సంస్థలు.. వ్యాక్సిన్ కోసం.. వందలు…వేల కోట్లు వెచ్చించి పరిశోధనలు చేస్తున్నాయి. కరోనా సోకిన తర్వాత తగ్గించడానికి ఇటీవల కొన్ని ఫార్మా కంపెనీలు.. మెడిసిన్స్ ప్రవేశపెట్టాయి కానీ.. వ్యాక్సిన్ విషయంలో మాత్రం పెద్దగా పురోగతి కనిపించలేదు. మొదటి సారి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఈ విషయంలో ముందడుగు వేసింది.