రజనీకాంత్ తెలుగు అభిమానులు డిజప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 27న ‘2.0’ బదులు ‘కాలా’ సినిమా వస్తుందంతే. రెండింటిలోనూ రజనీయే హీరో. సో.. అభిమానులు హ్యాపీ. కానీ, ఏప్రిల్ 27న ఏ సినిమాకు వెళ్ళాలో తెలీక సగటు సినిమా అభిమాని మాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆల్రెడీ తెలుగులో ఏప్రిల్ 27 రిలీజ్ డేట్ కోసం అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’, మహేష్‌బాబు ‘భరత్ అనే నేను’ సినిమాల నిర్మాతల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఇదేమీ పట్టనట్టు రజనీకాంత్ ‘2.0’ ప్రొడక్షన్ హౌస్ లైకా అదే రోజున తమ సినిమాను విడుదల చేస్తునట్టు ప్రకటించింది. ఆ వెంటనే ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమా కో ప్రొడ్యూసర్ ‘బన్నీ’ వాసు గరమ్ గరమ్ అయ్యారు. తర్వాత ‘2.0’ వాయిదా పడవచ్చు అనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలు విని హ్యాపీగా ఫీలైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ‘బన్నీ’ వాసు అయ్యుంటారు. కానీ, ఈ రోజు ‘కాలా’ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ విని షాక్ తినుంటారు.
ప్రస్తుతానికి ఏప్రిల్ 27న అల్లు అర్జున్ వర్సెస్ మహేష్ బాబు వర్సెస్ రజనీకాంత్ కన్ఫర్మ్. ముగ్గురి సినిమాలు ఒకే రోజున విడుదలకు సిద్ధమవుతున్నారు. ఎవరూ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ‘బన్నీ’ వాసు… ముందు మేమే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాం. ఎందుకు వెనక్కి తగ్గాలని గుస్సా అవుతున్నారు. మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ నిర్మాత డీవీవీ దానయ్య ఈ వివాదంపై ఏం మాట్లాడడం లేదు. రజనీకాంత్ అయితే తనకు ఏం పట్టనట్టు చెన్నైలో కూర్చుని చక్కగా వినోదం చూస్తున్నారు. ఎవరి పంతానికి వాళ్ళు పోయి మూడు సినిమాలను ఒకే రోజు విడుదల చేస్తారో? ఎవరైనా వెనక్కి వెళతారో? వెయిట్ అండ్ సీ!!