ఏప్రిల్ 27 మ్యాజిక్ చేస్తుందనుకుంటే… ఇప్పుడు ఆ డేట్ మారింది. ఏప్రిల్ 26న అసలైన మాయ జరగబోతోంది. నా పేరు సూర్య ఏప్రిల్ 27న వస్తోందని నిర్మాతలు ప్రకటించిన తరవాత.. భరత్ అను నేను సినిమా కూడా అదే రోజున విడుదల చేస్తామన్నారు. దీంతో ఏప్రిల్ 27న మహేష్, బన్నీల మధ్య క్లాష్ ఏర్పడింది. ఈలోగా రజనీకాంత్ సినిమా `కాలా`నీ అదే రోజున తీసుకొస్తామన్నారు. పరిస్థితి గమనించిన నా పేరు సూర్య టీమ్.. తమ సినిమాని ఒకరోజు ముందుకు జరిపింది. ఆ ప్రకటన వచ్చిన కాసేపటికే మహేష్ నిర్మాతలూ తమ డేట్ మార్చేశారు. ఏప్రిల్ 26నే తమ సినిమా కూడా వస్తుందని ప్రకటించారు. అంటే… పోటీలో తేడా ఏంలేదన్నమాట. రిలీజ్ డేటే మారింది. ఇలా మహేష్, బన్నీ సినిమాలు పోటీ పడి రిలీజ్ డేట్లు ప్రకటిస్తుంటే ఇటు అభిమానుల్లోనూ, అటు పంపిణీదారుల్లోనూ గందరగోళం మొదలైంది. ఇలాంటి పరిస్థితి టాలీవుడ్లో ఇంతకు ముందెప్పుడూ లేదు. మహేష్, బన్నీల చేతుల్లో ఏం లేకపోవొచ్చు. ఈ వ్యవహారం అంతా తెర వెనుక నుంచి నిర్మాతలే నడిపించి ఉండొచ్చు. కాకపోతే హీరోలిద్దరూ కూర్చుని మాట్లాడుకుని, ఈ గందరగోళానికి పుల్ స్టాప్ పెడితే బాగుంటుంది.