కడపలో వికాట్ గ్రూప్‌నకు చెందిన భారతి సిమెంట్స్ పరిశ్రమ ప్రభుత్వం మారితే మూసివేత ఖాయమేనని చర్చ జోరుగా సాగుతోంది. అన్ని రకాల నిబంధనలను ఈ సంస్థ ఉల్లంఘించింది. చివరికి పరిశ్రమ కోసం భూములు ఇచ్చిన వారినీ మోసం చేసింది. వారు తాజాగా పరిశ్రమ ముందు ఆందోళన చేశారు. ఏదో విధంగా బుజ్జగించి వారిని లోపలికి తీసుకెళ్లగలిగారు కానీ… తర్వాత పరిస్థితి అంచనా వేయడం కష్టంగా మారింది.
ఇప్పటికే పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతున్నామని భారతి సిమెంట్స్ పరిశ్రమ ఉన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే సిమెంట్ పరిశ్రమ కోసం కేటాయిచిన గనులు.. ఇతర విషయాల్లోనూ ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత వీటన్నింటి లెక్కలు చూసే అవకాశం ఉంది. గతంలో టీడీపీ ఉన్నప్పుడు కక్ష సాధింపు అంటారని.. ఈ పరిశ్రమ జోలికి వెళ్లలేదు. కానీ ఈ సారి మాత్రం ఎవరేమనుకున్నా పట్టించుకునే పరిస్థితి ఉండదు.
భారతి సిమెంట్స్ పరిశ్రమ సీఎం జగన్ కుటుంబానిదని అందరికీ తెలుసు. రికార్డుల్లో మాత్రం ఇది ఫ్రాన్స్ కు చెందిన వికాట్ గ్రూపుది. చాలా ఏళ్ల క్రితమే అంటే ఉత్పత్తి ప్రారంభానికి ముందే రూ. 2వేల కోట్లు పెట్టి 51 శాతం కొన్నది. కొన్నదన్న పేరే కానీ మొత్తం జగన్ కుటుంబానికి వదిలేసిపోయింది. పేరుకు ఓ డైరక్టర్ ఉంటారేమో.. మొత్తం నిర్వహణ.. జగన్ కుటుంబం చేతులలోనే. ఈ విచిత్రాన్ని కూడా బయటకు తీసే అవకాశం ఉంది.