గోవిందప్ప బాలాజీ. ఇప్పుడీ పేరు తాడేపల్లిలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఎవరు దొరికినా పర్వాలేదు ఆయన మాత్రం దొరకకూడదని.. తాడేపల్లిలోని అత్యున్నత వర్గాలు ఆయనను దాచి పెడుతున్నాయి. ఈ గోవిందప్ప బాలాజీ ఎవరో కాదు భారతి సిమెంట్స్ ఆర్థిక వ్యవహాలన్నీ చూసే వ్యక్తి. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి కూడా ఆయనేనని చెబుతున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత లిక్కర్ స్కాంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత….సీఐడీ లాగుతున్న తీగ తమ దాకా వచ్చిందని తెలిసిన తర్వాత ఆయనను ఆజ్ఞాతంలోకి పంపేశారు.
ఈ గోవిందప్ప బాలాజీ.. చాలా సొమ్మును భారతి సిమెంట్స్లోకి ప్రవహింప చేశారు. ఆ సొమ్ము ఎక్కడిది అన్నది రాబట్టాల్సి ఉంది. నిజానికి అసలు భారతి సిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందినది కాదు. అందులో మెజార్టీ వాటాలు అంటే 51శాతం ఫ్రాన్స్ కు చెందిన వికాట్ అనే కంపెనీ కొనేసింది. కానీ ఆ కంపెనీకి చెందిన వాళ్లెవరూ పట్టించుకోరు. అన్నీ భారతి రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతాయి. ఎప్పుడో పదిహేళ్ల క్రితమే రెండు వేల కోట్లు పెట్టి భారతి సిమెంట్స్ ను కైవసం చేసుకుని దాన్ని అమ్మినవారికే వదిలి పెట్టిపోయే మహానుభావులు ఎవరు ఉంటారు ?. ఇందులో ఏదో తిరకాసు ఉండకపోతే.
అవన్నీ దొరికిపోతాయన్న భయంతోనే ఇప్పుడు గోవిందప్ప బాలాజీని హైడ్ చేసేశారు. ఎక్కడ దాచినా.. ఎప్పుడో ఒకప్పుడు దొరకాల్సిందే. గుట్టు బయటకు లాగాల్సిందే. అయితే ఈ వ్యవహారాలన్నీ జగన్ ను దాటి ఆయన సతీమణి వద్దకు వెళ్తాయనే ఎక్కువ మంది వైసీపీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. భారతి ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీ దొరికితే చాలా విషయాలను ఆయన చెప్పకూడదనుకున్నా బయటకు లాగేస్తారు. అదే అసలు టెన్షన్.