వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవరెడ్డి పరారీలో ఉన్నారు. విచారణకు రావాలని నోటీసులు జారీ చేస్తే ఫోన్లు.. అన్నీ స్విచ్చాఫ్ చేసుకుని తనకు రోగం అని రాలేనని సమాచారం పంపారు. పోలీసులు ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్టు చేయడానికి రెడీ అయ్యారు. ఆయన దేశంలో ఉన్నారా లేదా అన్నదానిపైనా స్పష్టత లేదు. ఎలాగోలా ముందస్తు బెయిల్ తెచ్చుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఆయన తండ్రి ఆయనపై కక్ష కట్టారేమో తెలియదు కానీ.. ఆ జగన్ కేసులు వాదించే రాజ్యసభసభ్యుడు నిరంజన్ రెడ్డిని కాకుండా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని లాయర్ గా పెట్టారు. పొన్నవోలు సజ్జల భార్గవరెడ్డి చేసింది తప్పు కాదని చెప్పడం లేదు.. భారతీయ న్యాయ సంహిత కింద కేసులు పెట్టడం తప్పని వాదిస్తున్నారు. ఆయన తీరు ఎలా ఉందంటే.. గతంలో నేరాలు చేసినా… కొత్త చట్టం కింద కేసులు పెట్టలేరు కాబట్టి.. పాత నేరాలన్నీ చెల్లవని చెబుతున్నట్లుగా ఉంది. ఇంత పనికి మాలిన వాదన వినిపించే లాయర్ ఎక్కడా ఉండరని చెట్టుకింద ప్లీడర్లు కూడా నవ్వుకుంటున్నారు.
రఘురామమకృష్ణరాజు కేసులో హైకోర్టునే బెదిరించడంతో… సుప్రీంకోర్టు ఆ కేసులో నిందితుల పిటిషన్లను కొట్టి వేస్తోంది. విజయ్ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను అందుకే కొట్టి వేసింది. అయినా పొన్నవోలు మాత్రం.. వైసీపీని వదిలి పెట్టడం లేదు. ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డికి కూడా ఆయన షాక్ ఇప్పిస్తే.. సరిపోతుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా కేసుల్లో తాము తప్పు చేయలేదని.. ప్రజాస్వామ్యబద్దంగా ప్రశ్నించామని.. అయినా కేసులు పెట్టారని వాదిస్తే.. న్యాయవ్యవస్థ స్పందిస్తుందేమో కానీ.. తాము ఇతరుల కుటుంబాలకు రంకులు అంటగట్టామని.. మార్పింగులు చేశామని.. పుట్టుకల్ని ప్రశ్నించామని.. బూతులు తిట్టామని.. కానీ.. కొత్త చట్టాల ప్రకారం కేసులు పెట్టడం కుదరదంటే ఎలా అంగీకరిస్తారు ?