ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గోడలకెక్కుతున్నాయి. గతంలో చంద్రబాబు వియ్ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని అన్నారంటూ… ఓ ఇంగ్లిష్ పత్రికలో వచ్చిన వార్తను పెద్ద పెద్ద పోస్టర్లు చేసి వైసీపీ నేతలు అంటిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు పోటీగా భారత్ పే కు పోటీగా భారతీపే అనే పోస్టర్లు అంటిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పేటీఎంకు పేరడీగా పేసీఎం పోస్టర్లు తెచ్చి నలభై శాతం కమిషన్లు యాక్సెప్ట్ చేస్తారన్నట్లుగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఇప్పుడు భారతీ పే పేరుతో టీడీపీ నేతలు పోస్టర్లు వేస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఏపీలో రాజకీయాలు కుటుంబాలను టార్గెట్ చేసుకోవడం కామన్ అయిపోయింది. వైసీపీ నేతలు టీడీపీ నేతల కుటుంబాలను.. వారి కుటుంబసభ్యులనే టార్గెట్ చేసుకుంటూండటంతో మొహమాటాలు వదిలి టీడీపీ నేతలూ అదే పని చేస్తున్నారు. ప్రస్తుతం లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడు విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయనను ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఆ విజయసాయిరెడ్డి అల్లుడు సాక్షిలో వందల కోట్ల పెట్టుబడి పెట్టారు.
అసలు ఆయన ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెట్టిన పెట్టుబడి అంతా.. ఏపీ నుంచి లిక్కర్ స్కాంలో వసూలు చేసిందేనన్న ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారతిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడీ వ్యవహారం పోస్టర్లకు ఎక్కింది.