కాస్త లేటైనా.. అల్లూరి సీతారామరాజు ఎంట్రీ అదిరింది. ఈరోజు రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా `ఆర్.ఆర్.ఆర్`లోని రామ్‌చరణ్ టీజర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. అల్లూరి సీతారామరాజుని ఎన్టీఆర్ గొంతుతో పరిచయం చేస్తూ… కట్ చేసిన టీజర్ `ఆర్.ఆర్.ఆర్` స్థాయికి సూచిగా నిలబడిపోయేట్టు ఉంది.
”ఆడుకనబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది
కలబడితే ఏగుచుక్క ఎగబడినట్టుంటదది
ఎదురుబడితే చావుకైనా చావుకైనా చమటధారకడతది
బాణమైనా బందూకైనా వాడికి బాంచన్ అయితది
ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి
నా అన్న.. మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు” అంటూ ఎన్టీఆర్ ఇంట్రోతో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు రాజమౌళి. ఈ సినిమాలో రామ్‌చరణ్ పాత్రని నిప్పుతో పోలుస్తూ.. తీర్చిదిద్దనున్నాడు రామమౌళి. దానికి తగ్గట్టే… టీజర్లో నిప్పునీ, నిప్పుకణికల్ని ఎక్కువగా వాడుకున్నాడు. ఎప్పటిలానే… కీరవాణి తన ఆర్.ఆర్తో అదరగొట్టేశాడు. అల్లూరిగా రామ్ చరణ్ లుక్స్, తన ఎనర్జీ తప్పకుండా అభిమానులకు నచ్చుతాయి. సీతారామరాజుని కొమరం భీమ్ పరిచయం చేశాడు. ఇక కొమరం భీమ్ పాత్రని సీతారామరాజు పరిచయం చేస్తే చూడాలి. మరి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో..??