పవన్ కల్యాణ్ – భీమ్లా నాయక్ విడుదలకు ముస్తాబువుతోంది. ఈనెల 25న భీమ్లాని విడుదల చేస్తున్నామని చిత్రబృందం ప్రకటించినా, ఆ డేట్ మళ్లీ మారొచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు.. చివరి నిమిషంలో మార్పులూ, చేర్పుల కార్యక్రమం జోరుగా సాగుతోందన్నది టాక్. ఇది వరకే… ఫస్ట్ కాపీ రావడం, దాన్ని.. పవన్ చూసి ఓకే చేయడం జరిగిపోయాయి. అయితే.. రన్ లో.. సినిమా చూస్తున్నప్పుడు కొన్ని మార్పులు అవసరం అని చిత్రబృందం భావించిందట.
అందుకే.. పవన్ – నిత్యమీనన్లపై తెరకెక్కించింన ఓ పాటని లేపేశారు. ఇప్పుడు ఇంకాస్త ఫుటేజీ అవసరమై.. ఇది వరకు తొలగించిన ఓ సన్నివేశాన్ని, పాటనీ… చివర్లో జోడించార్ట. పవన్ పై తెరకెక్కించిన ఆ మాంటేజ్ సాంగ్.. ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఆడియో రూపంలో ఆ పాటని విడుదల చేయకుండా, నేరుగా స్క్రీన్ పైనే చూపించాలన్నది ఆలోచన. పవన్ `గద్దర్` గెటప్‌లో ఉన్న ఓ స్టిల్ ఇటీవల లీకైంది. ఆ గెటప్ ఈ మాంటేజ్ పాటలో అన్నది టాక్. అలానే పోలీస్ స్టేషన్‌లోని కొన్ని కామెడీ బిట్లు కూడా జోడించారని, అవన్నీ కలిస్తే 10 నుంచి 12 నిమిషాల ఫుటేజీ పెరిగిందని తెలుస్తోంది.