పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం ఆయనకు గుండెపోటు రాగా… హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గౌతమ్ రెడ్డి మరణంతో తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణం అందరినీ కలిచివేసింది. ఇలాంటి విషాద సమయంలో సినిమా వేడుక జరగడం సమంసజం కాదని నిర్ణయించుకున్న భీమ్లా నాయక్ సినిమా యూనిట్ వేడుకని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పేజీలో కూడా ఒక నోట్ రిలీజ్ చేశారు. ”ఈ విషాద సమయంలో సినిమా వేడుక చేయడానికి నా మనస్సు అంగీకరించడం లేదు. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలు చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేస్తుంది” అని వెల్లడించారు పవన్ కళ్యాణ్. అటు చిత్ర నిర్మాణ సంస్థ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేసింది.
Our deepest condolences to the family & friends of AP Minister Mekapati Goutham Reddy garu on his sudden demise. As a mark of respect, the pre-release event of #BheemlaNayak won't be happening today!
— Sithara Entertainments (@SitharaEnts) February 21, 2022