ఫిబ్రవరి 25… ఏప్రిల్ 1.. ఈ రెండు డేట్ల మధ్య ఊగిసలాడింది… భీమ్లా నాయక్. ఈనెలలో భీమ్లా రావడం దాదాపుగా అసాధ్యమన్నది అందరి నమ్మకం. అయితే.. అనూహ్యంగా భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ ప్రకటించి… షాక్ కి గురి చేశారు నిర్మాతలు. ఈనెల 25నే వస్తున్నామంటూ.. రిలీజ్ డేట్ పోస్టర్ వేశారు. దాంతో.. ఆ రోజున రావాలనుకున్న `గని` వాయిదా పడింది. ట్రైలర్ రిలీజ్ డేట్, ప్రీ రిలీజ్ ఫంక్షన్.. వగైరా వగైరా పబ్లిసిటీ కార్యక్రమాల్లో బిజీ అయిపోయింది భీమ్లా టీమ్.
అయితే ఇప్పుడు ఈనెల 25న ఎట్టిపరిస్థితుల్లోనూ భీమ్లా రాబోవడం లేదన్నది మరో టాక్. రిలీజ్ డేట్ విషయంలో చిత్రబృందం ఇంకా సందిగ్థంలో ఉందని, ఇప్పుడు మరోసారి వెనకడుగు వేయబోతోందని తేలింది. గురు, శుక్రవారాల్లో మళ్లీ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. భీమ్లా వాయిదా పడబోతోందన్న టాక్ రావడంతో.. ఇప్పుడు `గని` మళ్లీ లైన్ లోకి రావడానికి రెడీ అవుతున్నాడు. భీమ్లా రాకపోతే..`గని`కి మంచి స్పేస్ దొరికినట్టే. కాకపోతే… వస్తున్నాం – రావడం లేదు.. అంటూ.. భీమ్లా టీమ్ ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తోందన్నదే అర్థం కాని ప్రశ్న.