రొమాంటిక్ కామెడీ సినిమాలు ఈమధ్య బాగా తక్కువైపోతున్నాయి. గీత గోవిందం తరవాత ఈ జోనర్లో సినిమా రాలేదు. భీష్మ ఆలోటు తీర్చింది. నితిన్, రష్మిక జంటగా నటించిన సినిమా ఇది. వెంకీ కుడుముల దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ రోజు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ బుల్లి టీజర్ విడుదల చేశారు.
నా లవ్వు కూడా విజయ మాల్యా లాంటిదిరా..
కనిపిస్తుంది గానీ క్యాచ్ చేయలేం
అనే డైలాగ్తో టీజర్ ముగించారు. రష్మిక చుట్టూ హచ్ కుక్కలా తిరిగిన నితిన్ టీజర్ ఇది. రొమాంటిక్గా ఉంది. కలర్ఫుల్గా కనిపించింది. ఇద్దరి జంటా చూడముచ్చటగా కుదిరింది. త్రివిక్రమ్ స్టైల్లో ఓ పంచ్ కొట్టి…. ముగించారు. ఆర్.ఆర్ కూడా.. హుషారుగా ఉంది. భీష్మ – సింగిల్ ఫర్ ఎవర్ అనే ట్యాగ్ లైన్కీ, ఈ టీజర్కీ అస్సలు పొంతనే లేదు. కాకపోతే – ప్రేమ కథల్ని, రొమాంటిక్ కామెడీలనూ ఇష్టపడేవాళ్లకు మాత్రం మంచి విందు అందబోతోందని అర్థమైంది. ఫిబ్రవరి 21న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.