గోదావరి జిల్లాలలో అతి పెద్ద నగరంగా విస్తరించే అవకాశాలు భీమవరంకు మెండుగా కనిపిస్తున్నాయి. రాజమండ్రి, కాకినాడలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ భీమవరం విస్తరణకు మాత్రం చాలా అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అందుకే కొత్తగా భీమవరం మాస్టర్ ప్లాన్ రెడీ చేసి భారీగా అభివృద్ది చేయాలనికుంటున్నారు.
ఇటీవలి కాలంలో భీమవరంలో నూతన కాలనీలు ఏర్పడ్డాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో లే–అవుట్లు వేసి నిర్మాణాలు చేశారు. అవి పట్టణంలో విలీనం అయ్యాయి. పట్టణం అభివృద్ధి చెందినా అందుకనుగుణంగా పట్టణరూపు మారలేదు. శివారు ప్రాంతా లకు రోడ్లు అనుసంధానం కాలేదు. ఇప్పుడు సమగ్ర ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్లు, కనెక్ట్విటీ రోడ్లను నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెడుతున్నారు. నగరం మొత్తం 40 అడుగుల రోడ్లు …నరసాపురం–భీమవరం రోడ్డును 40 అడుగుల నుంచి 60 అడుగులు చేయాలన్ నడిమాండ్లు ఉన్నాయి.
హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన భీమవరం వాసులు .. తమ సొంత ఊరిలో ఇల్లు ఉండటం ఎంతో ముఖ్యమని అనుకుంటున్నారు. ఇప్పటికీ ఇల్లు ఉన్నా.. మరింత విశాలంగా ఉన్న కట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగా పెద్ద ఎత్తున ఇటీవలి కాలంలో స్థలాలు కొనేవారు పెరుగుతున్నారు. లే ఔట్లు కూడా పెరుగుతున్నాయి. గోదావరి జిల్లాలలో భీమవరం వచ్చే పదేళ్ల కాలంలో హాట్ ప్రాపర్టీగా మారుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.